మాటల మాంత్రికులు.. వలలో చిక్కామో అంతే | Cyber Crime: Youth Cheated Lakhs Of Money Through Online In Hyderabad | Sakshi
Sakshi News home page

మాటల మాంత్రికులు.. వలలో చిక్కామో అంతే

Published Fri, Jul 23 2021 7:37 AM | Last Updated on Fri, Jul 23 2021 7:50 AM

Cyber Crime: Youth Cheated Lakhs Of Money Through Online In Hyderabad - Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌( హైదరాబాద్‌): నగరంలోని వివిధ ప్రాంతంలో సైబర్‌నేరగాళ్లు ముగ్గురినుంచి 4.20 లక్షలు వారి ఖాతాల్లోంచి లాగేశారు.దీంతో బాధితులు  గురువా రం   సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
► బొల్లారానికి చెందిన పవన్‌ పార్ట్‌ టైం ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం వద్దు.. వ్యాపారంలో లాభాలు ఇప్పిస్తానని నమ్మించి పలు దఫాలుగా రూ. 1.60 లక్షలు తీసుకొని మోసం చేశాడు. 
► ఇన్‌స్ట్రాగామ్‌లో కనిపించిన ‘మార్కెటింగ్‌ ట్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ అనే యాడ్‌ చూసి సికింద్రాబాద్‌కు చెందిన శివాని వాట్సప్‌ ద్వారా సంప్రదించింది. సైబర్‌ నేరగాడు చెప్పినట్లు విని పలు దఫాలుగా రూ.1.20లక్షను పంపి మోసపోయింది. 
► ఆసిఫ్‌నగర్‌కు చెందిన వీణవాణికి ఓ వ్యక్తి పరిచమైయ్యాడు. ‘టూ ఎఫ్‌ఏయూక్యూ’ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేపించి రూ.1.50లక్షను పెట్టుబడి పెట్టించాడు. లాభాలు కనిపిస్తున్నా తీసుకోకపోవడానికి రాకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
► స్నేహితుడు తన ఫొటోలను అడ్డుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని మలక్‌పేటకు చెందిన బాధితురాలు గురువారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement