
యశవంతపుర: ఆదర్శంగా ఉండాల్సిన సైనికుడు తప్పుదోవ పట్టాడు. వితంతు మహిళను పెళ్లి చేసుకొని, మళ్లీ మరో యువతితో మూడుముళ్లకు సై అన్నాడు. మొదటి భార్య ఎంట్రీ తో సీన్ మారిపోయింది. ఈ సంఘటన హాసన్ జిల్లా భువనహళ్లిలో జరిగింది.
గతంలో వితంతు మహిళను పెళ్లాడి
వివరాలు... సైన్యంలో జవాన్‌గా పని చేస్తున్న కిరణ్‌కుమార్ కొంతకాలం కిందట ఒక వితంతు మహిళతో పరిచయం పెంచుకుని ఆమెను పెళ్లి చేసుకొని జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పలేదు. ఇంతలో ఎక్కువ కట్నం వస్తుందనే ఆశతో మరో యువతితో పెళ్లిని కుదుర్చుకున్నాడు. హాసన్ భువనహళ్లిలోని కళ్యాణ మండపంలో శుక్రవారం పెళ్లి వేడుక జరుగుతోంది. సరిగ్గా తాళిబొట్టు కట్టే సమయానికి మొదటి భార్య చేరుకుంది. తనను 6 నెలల క్రితం గుట్టుగా వివాహం చేసుకున్నట్లు వధువు తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఆమె ఎవరో తెలియదని, అబద్ధం చెబుతోందని పెళ్లికొడుకు మొండికేశాడు. తరువాత పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి అతన్ని విచారించగా, వితంతువును పెళ్లి చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. చివరికి పెళ్లి రద్దు కాగా, పోలీసులు వరుని కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
చదవండి: భర్తకు భలే ఆఫరాచ్చిన భార్య.. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో దంపతులు