రూ.50 నోట్లు కోసం ఆశపడి.. లక్షన్నర పోగొట్టుకుని లబోదిబోమన్నారు! | Thief Robbed 1.5 Lakh On Road In Usual Way Karnataka | Sakshi
Sakshi News home page

రూ.50 నోట్లు కోసం ఆశపడి.. లక్షలు పోగొట్టుకుని లబోదిబోమన్నారు!

Published Thu, Jul 14 2022 3:27 PM | Last Updated on Thu, Jul 14 2022 7:43 PM

Thief Robbed 1.5 Lakh On Road In Usual Way Karnataka - Sakshi

మైసూరు(బెంగళూరు): రోడ్డుపై రూ.50 నోట్లను విసిరేసిన దుండగులు ఓ వ్యక్తి దృష్టిని మళ్లించి రూ.1.5 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన మైసూరు జిల్లా టీ నరసీపురలో జరిగింది. మైసూరు నజర్‌బాద్‌ నివాసి అబ్దుల్‌ ఖాదర్‌ టీ.నరసీపురలోని ఎన్‌కేఎఫ్‌ పబ్లిక్‌ పాఠశాలలో పనులు చేస్తున్నాడు.  పనుల నిమిత్తం ఇచ్చిన చెక్‌ను కెనరా బ్యాంక్‌లో వేసి డబ్బులు డ్రా చేసుకుని బైక్‌పై పాఠశాలకు బయల్దేరాడు.

ఆ సమయంలో వర్షం రావడంతో బ్రిడ్జి వద్ద బైక్‌ నిలిపి డిక్కీ తెరిచి అందులోని జర్కీన్‌ వేసుకుంటున్నాడు. ఈ సమయంలో అతన్ని వెంబడిస్తూ వచ్చిన దుండగులు రోడ్డుపై రూ.50 నోట్లను విసిరేసి ఆ డబ్బు మీదేనేమో చూడండి అంటూ దృష్టి మరల్చారు. ఖాదర్‌ కిందకి వంగి నోట్లు తీసుకుంటుండగా దుండగులు డిక్కీలోని రూ.1.5 లక్షల నగదు దోచుకెళ్లారు. క్షణాల్లో నగదు మాయం కావడంతో కంగుతున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

చదవండి: Hyderabad: భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement