జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు.
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. పండుగరోజు అయినప్పటికీ రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ అందుబాటులో ఉండి బాధితుల ఫిర్యాదులు పరిశీలించారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21కి పైగా ఫిర్యాదులు అందాయి. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.