తాండూరు టౌన్ : తెలుగుదేశం పార్టీని మోసం చేసి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజుగౌడ్ ఆరోపించారు. పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని మంగళవారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిలాంటి పార్టీని వదిలి స్వలాభం కోసం ఆయన కాంగ్రెస్‌లో చేరారన్నారు. ఆయన పార్టీలో లేకున్నా వచ్చే నష్టమేమీ లేదన్నారు. టీడీపీ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడే ప్రసక్తేలేదన్నారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తాండూరు నుంచి బరిలోకి దిగుతానన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, మహారాజుల పాలనతోనూ ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరి కథ ముగించేస్తామని ధీమా వ్యక్తంచేశారు. బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పార్టీగా టీడీపీకి పేరుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుమిత్‌గౌడ్, పట్టణా«ధ్యక్షుడు మహేశ్‌సింగ్ ఠాకూర్, బషీరాబాద్ మండల అధ్యక్షుడు మ«ధుసూదన్‌గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాసిత్, నాయకులు మనోహర్, రుద్రుపాటిల్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ మోసం చేశాడు
Published Wed, Nov 8 2017 12:36 PM | Last Updated on Sat, Aug 11 2018 4:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment