సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ, హరియాణా ఉన్నాయి. 2023లో రాష్ట్రంలో సైబర్ నేరాలను పరిశీలిస్తే ప్రతి లక్ష మందికి 261 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది మనం చెబుతున్న మాట కాదు ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్) సీఈఓ రాజేశ్‌కుమార్ ఇటీవల వెల్లడించిన 2023 వార్షిక నివేదికలో పొందుపరిచారు.
ఇంకా అనేక ఆసక్తికర అంశాలూ ఆ నివేదికలో ఉన్నాయి. సైబర్ నేరాలపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతోంది. ఈ నేరాలపై 1930 టోల్‌ఫ్రీ నంబరుకు రోజుకు సరాసరిన 50వేల ఫోన్‌కాల్స్ వచ్చినట్టు ఐ4సీ నివేదిక తెలిపింది. 2023 సంవత్సరంలో ఎన్‌సీఆర్‌పీ( నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్)కి 15,56,176 ఫిర్యాదులు అందాయి. ఎన్‌సీఆర్‌పీకి సైబర్ నేరాలపై దేశవ్యాప్తంగా రోజుకు సరాసరిన 5వేల ఫిర్యాదులు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 2023లో అత్యధికంగా నమోదైన సైబర్ నేరాలు
♦ కేవైసీ అప్‌డేషన్ మోసాలు, కస్టమర్ కేర్ నంబర్ల పేరిట మోసాలు 35%
♦ సెక్స్‌టార్షన్ స్కామ్‌లు 24%
♦ ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ మోసాలు 22%
♦ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) మోసాలు 11%
♦ ఆండ్రాయిడ్ మొబైల్ మాల్వేర్ మోసాలు 8%
సైబర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం
దేశప్రజలకు సైబర్ భ ద్రత కల్పించడం మా ప్రధాన లక్ష్యం. దీని కో సమే కేంద్రం ఐ4సీ ఏ ర్పాటు చేసింది. సైబర్ నేరాల గుర్తింపు, దర్యా ప్తు, సైబర్ నేరాల కట్టడి చేయడం కేంద్ర హోంశాఖ మాకు ఇచ్చిన ప్రధాన బాధ్యతలు. ఇందుకోసం మేం ప్రత్యేక వేదికగా పనిచేస్తున్నాం. సైబర్ భద్రత అనేది ఇప్పుడు జాతీయ భద్ర తగా మారిన నేపథ్యంలో ఐ4సీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాల ప్రకారం బలోపేతం చేస్తూ వెళుతున్నాం. సైబర్‌నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. – వార్షిక నివేదిక సందర్భంగా ఐ4సీ సీఈఓ రాజేశ్‌కుమార్
సైబర్‌క్రైం పోర్టల్ బ్లాక్ చేసినవి
♦ 2,95,461 ఫేక్ సిమ్ కార్డులు
♦ 46,000 ఐఈఎంఐ డివైజ్‌లు
♦ 595 మొబైల్ అప్లికేషన్స్
♦ 2,810 ఫిషింగ్ వెబ్‌సైట్స్, యూఆర్‌ఎల్‌లు
Comments
Please login to add a commentAdd a comment