ప్రతీకాత్మక చిత్రం
శ్రీకాకుళం: నట్టింటికి నెట్ వచ్చినప్పటి నుంచి వలలో వేయడం, పడడం తేలికైపోయింది. వస్తువులు అ మ్మాలన్నా కొనాలన్నా చాలా మంది ఓఎల్‌ఎక్స్/క్వికర్ వంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు దీన్ని కూడా ఒక అవకాశంగా మలచుకొని ప్రజలను మోసగిస్తున్నారు.
ఎలా మోసం చేస్తారు..?
ఓఎల్‌ఎక్స్, క్వికర్ వంటి వెబ్‌సైట్లలో వస్తువులను అ మ్మదలచి పోస్ట్‌లను పెడితే, సైబర్ నేరగాళ్లు ఆర్మీ/ నేవీ లేదా పారా మిలటరీకి చెందిన ఉద్యోగులమని నమ్మించి ఆ వస్తువులను కొనడానికి అంగీకరిస్తారు. డబ్బులు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తామని చెప్పి ఎప్పటి దో రశీదు కావాలనే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారు. డబ్బులు రాలేదని గ్రహిస్తే.. ఏదో టెక్నికల్ కారణం వల్ల పేమెంట్ ఆగి ఉంటుందని, ఈసారి క్యూఆర్ కోడ్‌ను పంపిస్తున్నామని స్కాన్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేసి పేమెంట్ పొందాలని సూచిస్తారు. అలా చేస్తే మన అకౌంట్‌లో డబ్బులు పడడం బదు లు మన డబ్బులే పోతాయి. పోయాక కూడా అటువైపు వ్యక్తితో మాట్లాడితే ఇదే ప్రాసెస్‌ను రెండు మూ డు సార్లు చేయాలని చెప్పి అందిన కాడికి దోచేస్తారు. డబ్బు చేతికి అందిన వెంటనే కనెక్షన్ కట్ చేసేస్తాడు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇలాంటి నేరాలు చేసే వారు అవతలి వ్యక్తిని నమ్మించేందుకు ఆర్మీ/నేవీ/పారా మిలటరీ ఫోర్స్‌కు చెంది న ఉద్యోగులుగా ఫేక్ ఐడెంటిటీ కార్డులు లేదా పత్రా లు సృష్టించి వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓఎల్‌ఎక్స్, క్వికర్ వంటి వెబ్‌సైట్లలో పాత వస్తువులను కొనే ముందు లేదా అమ్మే ముందు అవతలి వ్యక్తి వివరాలు నిశితంగా పరిశీలించి సంప్రదింపులు జరపాలి. ఇలాంటి లావాదేవీల విషయంలో అడ్వాన్స్ పేమెంట్స్ చేయడం గానీ లేదా అంగీకరించడం గా నీ చేయకూడదు. అలాగే లింక్స్ క్లిక్ చేయడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం అంటే మోసపోవడమే. పిన్ నంబర్‌ను డబ్బులు పంపడానికే తప్ప రిసీవ్ చేసుకోవడానికి వాడం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమ్మే వ్యక్తి/కొనే వ్యక్తి అనవసరమైన కంగా రు లేదా తొందర పెడుతుంటే మోసమని గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment