online frouds
-
బీఅలర్ట్: స్కాన్ పేరుతో స్కామ్!
శ్రీకాకుళం: నట్టింటికి నెట్ వచ్చినప్పటి నుంచి వలలో వేయడం, పడడం తేలికైపోయింది. వస్తువులు అ మ్మాలన్నా కొనాలన్నా చాలా మంది ఓఎల్ఎక్స్/క్వికర్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు దీన్ని కూడా ఒక అవకాశంగా మలచుకొని ప్రజలను మోసగిస్తున్నారు. ఎలా మోసం చేస్తారు..? ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి వెబ్సైట్లలో వస్తువులను అ మ్మదలచి పోస్ట్‌లను పెడితే, సైబర్ నేరగాళ్లు ఆర్మీ/ నేవీ లేదా పారా మిలటరీకి చెందిన ఉద్యోగులమని నమ్మించి ఆ వస్తువులను కొనడానికి అంగీకరిస్తారు. డబ్బులు ఆన్లైన్లో బదిలీ చేస్తామని చెప్పి ఎప్పటి దో రశీదు కావాలనే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారు. డబ్బులు రాలేదని గ్రహిస్తే.. ఏదో టెక్నికల్ కారణం వల్ల పేమెంట్ ఆగి ఉంటుందని, ఈసారి క్యూఆర్ కోడ్‌ను పంపిస్తున్నామని స్కాన్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేసి పేమెంట్ పొందాలని సూచిస్తారు. అలా చేస్తే మన అకౌంట్లో డబ్బులు పడడం బదు లు మన డబ్బులే పోతాయి. పోయాక కూడా అటువైపు వ్యక్తితో మాట్లాడితే ఇదే ప్రాసెస్‌ను రెండు మూ డు సార్లు చేయాలని చెప్పి అందిన కాడికి దోచేస్తారు. డబ్బు చేతికి అందిన వెంటనే కనెక్షన్ కట్ చేసేస్తాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి నేరాలు చేసే వారు అవతలి వ్యక్తిని నమ్మించేందుకు ఆర్మీ/నేవీ/పారా మిలటరీ ఫోర్స్‌కు చెంది న ఉద్యోగులుగా ఫేక్ ఐడెంటిటీ కార్డులు లేదా పత్రా లు సృష్టించి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి వెబ్సైట్లలో పాత వస్తువులను కొనే ముందు లేదా అమ్మే ముందు అవతలి వ్యక్తి వివరాలు నిశితంగా పరిశీలించి సంప్రదింపులు జరపాలి. ఇలాంటి లావాదేవీల విషయంలో అడ్వాన్స్ పేమెంట్స్ చేయడం గానీ లేదా అంగీకరించడం గా నీ చేయకూడదు. అలాగే లింక్స్ క్లిక్ చేయడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం అంటే మోసపోవడమే. పిన్ నంబర్‌ను డబ్బులు పంపడానికే తప్ప రిసీవ్ చేసుకోవడానికి వాడం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమ్మే వ్యక్తి/కొనే వ్యక్తి అనవసరమైన కంగా రు లేదా తొందర పెడుతుంటే మోసమని గ్రహించాలి. -
ఆన్లైన్ చీటింగ్!
మహబూబ్‌నగర్ క్రైం: సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.. కొంత నగదు జమ చేసి.. మీరు కొంత మందిని చేర్పిస్తే మీ ఖాతాలో ప్రతినెలా కమీషన్ వేస్తామని నమ్మబలికారు.. ఇలా సామాన్యుల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారు.. ఈ ఘటనపై పది రోజుల క్రితం జిల్లాకేంద్రంలోని మర్లుకు చెందిన మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఇందులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అనురాధ వెల్లడించారు. హైదరాబాద్ టు దుబాయ్.. హైదరాబాద్‌లోని కొత్తపేట్ పనిగిరికాలనీకి చెందిన మాలావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి దుబాయ్‌కి చెందిన అనూప్ థామస్‌తో ఆన్లైన్ ద్వారా పరిచయం చేసుకున్నారు. సీసీటీసీ గ్లోబల్ డాట్కాం ద్వారా రూ.12 వేలు డిపాజిట్ చేసి ఒక ఐడి తీసుకుంటే రోజుకు రూ.0.60 కమీషన్ వస్తుందని, ఎన్ని ఐడీలు తయారు చేస్తే అన్ని డాలర్ల కమీషన్ చెల్లిస్తామ నమ్మబలికారు. మాలావత్ లక్ష్మణ్ ఆ వెబ్‌సైట్‌ను తయారు చేసి దాదాపు 200 మందికి మాయమాటలు చెప్పి అతని ఖాతాతోపాటు భార్య, ఇతర బంధువుల ఖాతాలో రూ.కోట్లలో నగదును జమ చేయించారు. ఇందులో భాగంగానే మాలావత్ లక్ష్మణ్ గతేడాది సెప్టెంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వారా మహబూబ్‌నగర్‌కు వ చ్చాడు. ఆ తర్వాత జిల్లాకేంద్రం లోని అయోధ్యనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయప్రతాప్రెడ్డితో పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత మాలావత్ లక్ష్మణ్ ఏర్పాటు చేసిన సీసీటీసీ గ్లోబల్ డాట్కాం గురించి వివరించి దీని ద్వారా సులభంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందని చెప్పడంతో విజయప్రతాప్రెడ్డితోపాటు భీమయ్య, బాలకృష్ణ, గిరి కలిసి సామాన్య అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి పట్టణానికి చెందిన 47 మందిని ఆ వెబ్సైట్లో చేర్పించారు. ఇందులో ఒక్కొక్కరు రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేశారు. అలాగే ఒక మహిళ రూ.7.50 లక్షలు జమ చేసింది. దీంట్లో ఒక్కరికి కూడా 10 శాతం నగదు తిరిగి ఇవ్వలేదు. అయితే గత మూడు నెలలుగా ఖాతాలో నగదు పడకపోవడంతో మర్లుకు చెందిన మణెమ్మ విజయప్రతాపరెడ్డిని సంప్రదించగా తనకేం తెలియదని, వెబ్సైట్ తయారు చేసిన వ్యక్తి దగ్గర మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో మణెమ్మ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ చేపట్టగా వివరాలు బయటికి వచ్చాయని ఎస్పీ పేర్కొన్నారు. కేసులు నమోదు.. మాలావత్ లక్ష్మణ్ నుంచి రూ.1,79,100, విజయప్రతాప్‌రెడ్డి నుంచి రూ.5 లక్షల నగదు సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. అలాగే మాలావత్ లక్ష్మణ్‌తోపాటు అతని భార్య, ఇతర కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు, విజయప్రతాప్‌రెడ్డి ఖాతాలో ఉన్న రూ.47.41 లక్షలను ఫ్రీజ్ చేశామన్నారు. ఈ కేసులో ఏ1గా మాలావత్ లక్ష్మణ్, అతని అత్త మంగమ్మ, మరదలు కవిత, భార్య సరిత, స్నేహితుడు అఖిల్, ఏ2గా విజయప్రతాప్‌రెడ్డి, ఏ3గా భీమయ్య, ఏ4గా బాలకృష్ణ, ఏ5గా గిరిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మాలావత్ లక్ష్మణ్, విజయ ప్రతాప్‌రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్ తరలించామని, మిగతా వ్యక్తులు పరారీలో ఉన్నారని వాళ్లను కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. ఇంట్లో కూర్చోని సులువుగా డబ్బులు సంపాదించవచ్చని మల్టీలెవల్ మార్కెటింగ్ ద్వారా ఆన్లైన్లో డబ్బులు పెడితే మోసం పోతారన్నారు. ఇలా డబ్బులు జమ చేస్తే కమీషన్ వస్తోందని చెప్పే వ్యక్తులను ఏమాత్రం నమ్మరాదని డబ్బులు తీసుకుని తర్వాత ఖాతాలను ఎత్తివేసి చీటింగ్ చేస్తారని హెచ్చరించారు. దీంట్లో బాధితులు కట్టిన డబ్బులో కనీసం 10 శాతం కూడా తిరిగి రాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వ ర్లు, డీఎస్పీ భాస్కర్, రూరల్ సీఐ కిషన్, ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ యువతుల వలలో పడ్డారో.. ఇక అంతే
తియ్యటి మాటలతో కవ్విస్తారు ఆపై మీ సొమ్మును ఖాళీ చేయిస్తారు గుర్తుతెలియని ఎస్ఎంఎస్లతో జాగ్రత్త వలలో పడ్డారో.. జీవితం సర్వనాశనం ముచ్చటగా మిస్డ్ కాల్ ఇస్తారు. ఆ పై కొందరు యువతులు తియ్యని మాటలతో ముగ్గులోకి దింపుతారు. మనసు దోచుకునేలా కబురులు చెబుతారు. మీ దగ్గర ఉన్న సొమ్మునంతా ఖాళీ చేయిస్తారు. ఆపై చెప్పాపెట్టకుండా హుడాయిస్తారు.. ఆ వలలో పడ్డారో.. ఇక అంతే.. జీవితం సర్వనాశనం.. గుర్తుతెలియని ఎస్‌ఎంఎస్‌లతోనూ జాగ్రత్త సుమా..! తిరుపతి తుడా: ఇటీవల యువత సామాజిక మాధ్యమాలపై మోజు పెంచుకుంటోంది. యువతీ, యువకులు ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుంటున్నారు. వాటి యావలోనే బతుకు వెళ్లదీస్తున్నారు. అవికాస్త వికటించడంతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతి నగరంతోపాటు జిల్లాలోనూ పెచ్చుమీరుతున్నారు. తిరుపతిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న యువకుడికి పది రోజుల క్రితం మిస్డ్ కాల్ వచ్చింది. మొదట పట్టించుకోలేదు. మరుసటి రోజు మళ్లీ అదే నంబర్ నుంచి మిస్డ్ కాల్ రావడంతో తెలిసిన వాళ్లెవరైనా ఉంటారేమోనని తిరిగి కాల్ చేశాడు. అటుపక్క నుంచి ఓ యువతి హలో.. పవనే కదా.. అంటూ మాటలు కలిపింది. ఆపై ఇద్దరూ రోజూ చాటింగ్‌లో హాయ్.. బాయ్‌లు చెప్పడం మొదలు పెట్టారు. వారం తర్వాత సార్ ఏమీ అనుకోవద్దు.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను.. డబ్బులు అవసరం ..ఏడుపొస్తోంది.. అనగానే కరిగిపోయిన అతను ఎంత అవసరమని అడిగాడు. రూ.10 వేలు.. సాయంత్రం కల్లా ఇవ్వకుంటే పెద్ద సమస్య వచ్చి పడుతుందని చెప్పడంతో అతను నమ్మి ఆ మొత్తాన్ని ఆ యువతి చేతిలో పెట్టాడు. ఆపై మాటలు కట్.. నంబర్ స్విచ్చాప్.. ఖంగుతిన్న ఆ యువకుడు డబ్బుల కోసమే ఇదంతా జరిగిందని తెలుసుకుని బాధపడ్డాడు. తిరుపతి రాయల్ నగర్‌కు చెందిన ఓ యువకుడికి నాలుగు రోజుల క్రితం వాట్సాప్‌కు హయ్ అని ఓ మెస్సేజ్ వచ్చింది. రాత్రి 9 దాటితే అలా ప్రతిరోజూ హాయ్.. హలో అంటూ మెసేజ్‌లు రావడంతో తిరిగి హౌ ఆర్ యూ అని మెసేజ్ పెట్టాడు. ట్రూ కాలర్ ద్వారా అప్పటికే అతని పేరు తెలుసుకున్న ఓ యువతి మీరు నాకు తెలుసు.. నేను ఎవరినో కనుక్కోండి చూద్దాం అంది. అర్థంగాక అతను జుట్టు పీక్కున్నాడు. మీరు ఎవరు అని అడగడం మొదలు పెట్టాడు. ఆ యువతి బాలాజీ కాలనీలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటానని చెప్పింది. నేను ఇంత చెప్పాను మరి మీ గురించి చెప్పవచ్చు కదా.. అంటూ అతని డేటా లాగుతూ రోజూ తియ్యని మాటలు చెప్పడం మొదలు పెట్టింది. రెండు రోజుల క్రితం కాల్ చేసి.. నా ఫ్రెండ్‌ను ఆస్పత్రిలో చేర్పించాము.. అర్జెంట్‌గా రూ.18 వేలు కట్టమంటున్నారు.. హాస్టల్లో ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు.. వాళ్ల అమ్మానాన్మలు రావడానికి ఒక రోజు పడుతుంది. మనీ అడ్జస్ట్ చెయ్యి.. వాళ్లు రాగానే తీసి ఇస్తాను అని చెప్పడంతో అతను నిజమే అని నమ్మాడు. తన వద్ద రూ.12,000 ఉందని చెప్పడంతో చాల్లే మిగతా నా దగ్గర ఉంది అని చెప్పి ఆ యువతి స్కూటీలో మాస్క్‌తో వచ్చి తీసుకెళ్లింది. ఆపై ఆ యువతి అడ్రస్ మాయమయ్యింది. ఇప్పటికీ అడ్రస్ లేదు.