హైదరాబాద్: దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో పది శాతానికిపైగా తెలంగాణలోనే ఉన్నట్లు టెలికం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జేవీ రాజారెడ్డి తెలిపారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సాధారణ ప్రజల అవగాహన కోసం శాఖాపరంగా రూపొందించిన కరపత్రాన్ని బుధవారం ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. మన జనాభాలో దాదాపు 50% మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారని, ఆన్‌లైన్ వ్యాపారంలో చైనా తర్వాత మనదేశం 2వ స్థానంలో ఉన్నదని వివరించారు.
అనంతరం డిప్యూటీ డైరెక్టర్ జనరల్(టెలికం సెక్యూరిటీ) జి.గౌరీశంకర్ మాట్లాడుతూ.. వివిధ ఆర్థిక మోసాలకు గురికాకుండా మొబైల్ సంబంధిత సెక్యూరిటీ అంశాల గురించి వివరించారు. ఓటీపీ మోసాలు, కెవైసీ మోసాలు, క్యూఆర్ కోడ్ మోసాలు, స్మార్ట్ ఫోన్ ఫిషింగ్, మొబైల్ టవర్ మోసాలు, నకిలీ కాల్ సెంటర్ మోసాలు, ఉద్యోగ మోసాలు మొదలైన మోసాల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
(చదవండి: కారు పార్కింగ్ కష్టాలకు చెక్.. హ్యుందాయ్ సరికొత్త ఆవిష్కరణ)
Comments
Please login to add a commentAdd a comment