Credit Card Fraud: ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నకిలీ ఆఫర్స్ పేరుతో వచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి చాలా మంది ఇప్పటికే లక్షల్లో పొగుట్టుకున్న భాదితులు ఎందరో ఉన్నారు. అయితే, ఇప్పుడు మళ్లీ అలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. వంద రూపాయల మీల్స్ ఆర్డర్ చేస్తే రెండు మీల్స్ ఫ్రీ అనే ప్రకటనను ఫేస్‌బుక్‌లో చూసి ముంబైకి చెందిన 74 ఏళ్ల వృద్దుడు మోసపోయాడు. క్రెడిట్ కార్డుతో రూ.10 చెల్లించి మిగిలిన రూ 90 పుడ్ డెలివరీ అయిన తర్వాత చెల్లించవచ్చని యాడ్‌లో పేర్కొనడంతో ఆశపడిన బాధితుడు క్రెడిట్ కార్డుపై ఏకంగా రూ లక్ష పోగొట్టుకున్నాడు.
బాధితుడు ఎన్.డి నంద్ జనవరి 19న ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటనను చూసి దాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత సుమారు రూ.లక్ష వరకు మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో ఇలా పేర్కొన్నాడు.. " ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటనను చూసి అందులో పేర్కొన్న కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేశాను. అప్పుడు, దీపక్ అనే పేరుతో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ.. ఫుడ్ ఆర్డర్ చేయడానికి నా క్రెడిట్ కార్డు వివరాలను అందించాలని కోరాడు. మొదట్లో రూ.10 కట్ అవుతుందని, ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత రూ.90 నగదు చెల్లిస్తే సరిపోతుందని ఆయన నాకు చెప్పారు. ఆర్డర్ బుక్ చేయడానికి ఒకసారి పాస్ వర్డ్ షేర్ చేయమని ఆ వ్యక్తి నన్ను అడిగాడు" అని పేర్కొన్నాడు.
పోలీసుల కథనం ప్రకారం.. భాదితుడి లావాదేవీ నుంచి రూ.10 కట్ అయిన తర్వాత వెంటనే క్రెడిట్ కార్డు నుంచి రూ.49,760 కట్ అయినట్లు రెండు సార్లు ఎస్ఎంఎస్ వచ్చాయని తెలిపారు. అయితే, ఈ డబ్బు ఎవరి ఖాతాలో క్రెడిట్ అయ్యిందో తెలుసుకోవడానికి బ్యాంకు నుంచి వివరాలను కోరాము" అని ఖర్ పోలీస్ స్టేషన్ అధికారి చెప్పారు. సైబర్ మోసగాడిని ట్రాక్ చేయడానికి ఖర్ పోలీసులు కాల్ డేటాను కూడా సేకరిస్తున్నారు. సైబర్ నెరగాళ్ల మీద ఐటీ చట్టం కింద కేసు నమోదైంది.
(చదవండి: Air India: టాటా గూటికి ఎయిర్ ఇండియా చేరేది అప్పుడే!)
Comments
Please login to add a commentAdd a comment