
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : ప్రభుత్వ పథకాల పేరిట గర్భిణులను మోసగించటానికి ప్రయత్నించిన ఓ సైబర్ క్రైం గ్యాంగ్ గుట్టురట్టయింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ చీటింగ్ కేసులో అరెస్టయిన గ్రూపు నాయకుడిని విచారించగా ఈ మోసం వెలుగు చూసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన ఎనిమది మంది సభ్యుల సైబర్ క్రైం గ్రూపు దాదాపు 150 మంది బ్యాంక్ అకౌంట్ల వివరాలను తెలుసుకుంది. అనంతరం అకౌంట్లలోని డబ్బులను ఇతర ఖాతాలకు బదిలీ చేసి, మోసగించింది. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గ్రూపు నాయకుడు గుణిలాల్ మండల్‌ను అరెస్ట్ చేశారు. ( విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం)
అతడి వద్దనుంచి 100 ఫోన్ నెంబర్లు కలిగిన నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సైబర్ క్రైం గ్రూపు ప్రభుత్వ పథకాల ద్వారా 2,500 రూపాయలు వస్తాయంటూ బిహార్, జార్ఖండ్‌లలోని గర్భిణుల అకౌంట్ వివరాలు సేకరించింది. అనంతరం వారి ఖాతాలలోని డబ్బు మాయం చేయటానికి ప్రయత్నించింది. ఇలోపే పోలీసులు గుణిలాల్‌ను అరెస్ట్ చేయటంతో పథకం విఫలమైంది. దాదాపు 100 మంది గర్భిణులనుంచి అకౌంట్ వివరాలు సేకరించినట్లు పోలీసుల విచారణలో గుణిలాల్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment