ముంబై: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించింది. ఈ మేరకు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల అలర్ట్ లిస్ట్‌లో మరో 13 కంపెనీలను జోడించింది. తద్వారా అలర్ట్ లిస్ట్‌లో చేరిన కంపెనీల సంఖ్య 88కి చేరుకుంది.
రేంజర్ క్యాపిటల్, టీడీఎఫ్‌ఎక్స్, ఐనెఫెక్స్, యార్కర్‌ఎఫ్‌ఎక్స్, గ్రోలైన్, థింక్ మార్కెట్స్, స్మార్ట్ ప్రాప్ ట్రేడర్, ఫండెడ్‌నెక్ట్స్, వెల్‌ట్రేడ్, ఫ్రెష్‌ఫారెక్స్, ఎఫ్‌ఎక్స్ రోడ్, డీబీజీ మార్కెట్స్, ప్లస్‌వన్‌ట్రేడ్ వీటిలో ఉన్నాయి. అలర్ట్ లిస్ట్ సమగ్రమైనది కాదని, జాబితాలో లేనంత మాత్రాన ఆ కంపెనీని అధీకృతమని భావించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానా
ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్–1999 (ఫెమా) ప్రకారం ఫారెక్స్‌లో డీల్ చేయడానికి అధికారం లేని లేదా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ (రిజర్వ్ బ్యాంక్) ఆదేశాలు–2018 ప్రకారం ఫారెక్స్ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ (ఈటీపీ) ఆపరేట్ చేయడానికి అధికారం లేని కంపెనీల పేర్లను అలర్ట్ లిస్ట్‌లో చేరుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment