బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు | Gold and Silver Price Today 7th April 2025 | Sakshi
Sakshi News home page

Today Gold and Silver Price: బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు

Published Mon, Apr 7 2025 10:19 AM | Last Updated on Mon, Apr 7 2025 10:27 AM

Gold and Silver Price Today 7th April 2025

దేశంలో బంగారం ధరలు పతనమవుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 7) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 280 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,850 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధర.. ఈ రోజు రూ. 250 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 280 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 250, రూ. 280 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,850 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,850 వద్ద ఉంది.

ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 83,000 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 90,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 280 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.

వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 7) కేజీ సిల్వర్ రేటు రూ. 10,3000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 94,000 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement