దేశంలో బంగారం ధరలు (Gold Prices) కాస్త కరుణించాయి. రోజురోజుకూ అంతకంతకూ పెరుగుతూ కొత్త రేట్లకు చేరుతూ కొనుగుగోలుదారులకు కంగారు పుట్టిస్తున్న పసిడి ధరలు నేడు (January 27) స్వల్పంగా దిగివచ్చాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధరల్లోనూ తగ్గుదల కనిపించింది.
ఇది చదివారా? ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా.. ఎప్పటినుంచంటే?
బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.150 (22 క్యారెట్స్), రూ.170 (24 క్యారెట్స్) చొప్పున తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 75,400కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,250 వద్దకు దిగివచ్చాయి.
ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.82,400 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,550 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.170, రూ.150 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి: భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32వేలు వడ్డీ
చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.150 తగ్గి రూ. 75,400 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.170 క్షీణించి రూ. 82,250 వద్దకు తగ్గాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు తగ్గుదల నమోదైంది. కేజీకి రూ.1000 మేర వెండి ధర దిగివచ్చింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్ద, ఢిల్లీలో రూ. 96,500 వద్ద ఉన్నాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment