
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించారు. ఆ తరువాత చైనా.. యూఎస్ఏ మీద 34 శాతం ప్రతీకార సుంకం ప్రకటించింది. దీంతో బంగారం ధర సుమారు రూ. 2,800 లేదా రెండు శాతం తగ్గింది.
అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ సమయంలోనే బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని కమోడిటీ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అమెరికా, చైనాతో సహా ఇతర దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా.. బంగారం ధరల ర్యాలీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నదని ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు 'సుగంధ సచ్‌దేవా' పేర్కొన్నారు. అయితే అమ్మకాలు మాత్రమే స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
ఇండియన్ మార్కెట్లో బంగారం ధరలు రూ. 83,100 (22 క్యారెట్ 10 గ్రామ్స్), రూ. 90,660 (24 క్యారెట్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గుముఖం పట్టాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.