సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం, దక్షిణ కోస్తా మయన్మార్‌లోని ఉపరితల ఆవర్తనం తూర్పు, పశ్చిమ ద్రోణితో కలిసిపోయి.. సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని.. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఈ క్రమంలో మంగళవారం నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
SEVERE STORMS WARNING ⚠️
As peak convergence is expected, today will be WIDESPREAD powerful storms, lightining in RED marked districts next 24hrs. Multiple storms are expected ⚠️
HYD - Multiple spells of powerful storms (2-3 strong ones) expected next 24hrs ⚠️⚡ pic.twitter.com/ySeub3wSdC— Telangana Weatherman (@balaji25_t) September 23, 2024
మంగళవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.
బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment