సాక్షి, న్యూఢిల్లీ: మహిళపై ఇటుక విసిరి వార్తల్లోకి ఎక్కిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సతీష్ చంద్రకు బెయిలు లభించింది. లంచం ఇవ్వనందుకు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ తనను ఇటుకతో కొట్డాడని ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలపై సతీష్ చంద్ర.. మహిళను లంచం అడిగినట్లుగా సరైన ఆధారాలు లభించనందున రూ.10 వేల పూచికత్తుపై బెయిలు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.
ఈ ఘటనకు సంబంధించి రెండు పరస్పర విరుద్ధమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయని న్యాయమూర్తి నరోత్తమ్ కౌశల్ చెప్పారు. రెడ్‌లైడ్ ఉల్లంఘించినందుకు తనను ఆపిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రూ. 200 లంచం అడిగాడని, లంచం ఇవ్వకపోవడంతో తనపై ఇటుకతో దాడి చేశాడని ఓ మహిళ ఆరోపించింది. ఇందుకు సంబంధించి లభించిన వీడియో సాక్ష్యం ఆధారంగా ఢిల్లీ పోలీసులు హెడ్ కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి అరెస్టు చే శారు. న్యాయస్థానం అతన్ని 14 రోజుల న్యాయ నిర్బంధానికి పంపింది. కానీ ఆ తరువాత మరో ఆడియో క్లిప్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆడియో క్లిప్‌లో మహిళ హెడ్ కానిస్టేబుల్‌ను దూషించడం, చలాన్ చెల్లించడానికి నిరాకరించడం వంటివి రికార్డయ్యాయి.
ఇటుకతో దాడిచేసిన హెడ్‌కానిస్టేబుల్‌కు బెయిలు
Published Sun, May 17 2015 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement