Delhi Police constable
-
ఢిల్లీ రోడ్లా..? మజాకా..!
అది దేశ రాజధాని ఢిల్లీ. పైగా నిత్యం లక్షల వాహనాలు తిరిగే రద్దీ రోడ్లు. మరి అక్కడి రోడ్డు ఎలా ఉండాలి? చాలా భద్రంగా, పటిష్టంగా ఉండాలి. కానీ ఓ చినుకు పడితేనే నీళ్లు నిలిచి పోయి, రోడ్లు కుంగిపోతే. రోడ్డు వేసిన కాంట్రాక్టర్, దాని నాణ్యతను గాలికి వదిలేసిన ప్రభుత్వానిదే బాధ్యత. ఇది దేశ రాజధాని పరిస్థితి మాత్రమే కాదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితుల వల్ల వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రోడ్లపై నీరు భారీగా చేరింది. అయితే నాణ్యత లేని రోడ్ల వలన వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ వాహనం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ద్వారకాలోని అతుల్యా చౌక్ వద్ద రోడ్డులో కుంగిపోయింది. ఈ ఘటనలో ఎవకూ గాయపడలేదు. కాగా ప్రమాదం జరిగిన కొద్దిసేపటి హైడ్రో క్రేన్ సహాయంతో కారును బయటకు తీసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. అంతేకాకుండా వజీరాబాద్ ప్రాంతంలో వ్యాన్‌పై ట్రక్కు బోల్తా పడిపోవడంతో ఆరుగురు గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. అయితే ‘‘ఢిల్లీ రోడ్ల పనితనం అంటే.. మజాకా!’’ అంటూ ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక గడిచిన 24 గంటల్లో దేశ రాజధానిలో 70 మి.మీ. వర్ష పాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. 15 మిమీ కంటే తక్కువ వర్షపాతం తేలికపాటి వర్షంగా, 15-64.5 మిమీ ఓ మోస్తరుగా, 65.5-115.5 మిమీ ‘హెవీ’గా, 115.6-204.4 మిమీ భారీ వర్షపాతంగా, 204.4 మిమీ పైన అతిభారీ వర్షపాతంగా పరిగణిస్తారు. -
Delhi: చేతులపై మోసుకెళ్లి..బామ్మకు కరోనా టీకా
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏం మాట్లాడాలి అనుకున్నా కరోనాతోనే మొదలవుతుంది. దానితోనే ముగుస్తుంది. కరోనా చాలామంది జీవితాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. మనుషులు ఏదో రకంగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కుల్దీప్ సింగ్ ఓ 82 ఏళ్ల బామ్మను తన చేతుల్లో మోసుకెళ్లి టీకా వేయించారు. శైలా డిసౌజా(స్పిన్స్టర్,రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్) కరోనా టీకా వేయించుకోవాలనే కోరికను కానిస్టేబుల్ కుల్దీప్కు తెలియజేసింది. దాంతో అతడు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు విషయాన్ని తెలిపాడు. అలా టీకా కోసం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఆమె గత రెండు సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది. వీల్‌చైర్‌లో వ్యాక్సినేషన్ వేసే దగ్గరకి తీసుకెళ్లడానికి వీలులేదు. దీంతో ఆ కానిస్టేబుల్ బామ్మను రెండో ఫ్లోర్ నుంచి తన చేతుపై మోసుకెళ్లారు. అక్కడ వ్యాక్సిన్ వేయించి తిరిగి ఇంటి దగ్గరకు చేర్చాడు. కానిస్టేబుల్ కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ... "ఆమె నా బీట్ ప్రాంతానికి చెందిన సీనియర్ సిటిజన్. ఆమె యోగక్షేమాలు తెలుసుకోవడానికి తరచూ వెళ్తుంటాను. అయితే బామ్మ కోవిడ్ టీకా తీసుకోవాలనే కోరికను నాతో పంచుకుంది. దాంతో మా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి తెలిపి పోర్టల్‌లో టీకా కోసం నమోదు చేయించాం." అని అన్నారు. అంతేకాకుండా "మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటాం. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం ఉద్యోగంలో భాగం మాత్రమే కాదు. బాధలో ఉన్న వ్యక్తులలో మా కుటుంబాన్ని చూస్తాం. అలాంటి వారికి నావంతు సహాయం చేస్తాను." అని ఢిల్లీ కానిస్టేబుల్ కుల్దీప్ అన్నారు. కాగా ఢిల్లీ కానిస్టేబుల్ సాయానికి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. (చదవండి: Seeti Maar: డాక్టర్ల అదిరిపోయే డ్యాన్స్.. దిశా పటాని ఫిదా!) -
ప్లాట్ ఫాం స్కూల్.. పోలీసు మాస్టారు
న్యూఢిల్లీ: సాధారణంగా పోలీసులు వస్తున్నారంటే చాలు చిన్నపిల్లలేకాదు పెద్దవారికి కూడా చాలా భయం ఉంటుంది. వారి చేతిలో లాఠీ, చంకలో తుపాకీ, బూట్ల చప్పుడు భయం కలిగిస్తాయి. కానీ, అలాంటిది కనిపిస్తే చాలు తన్ని తరిమేసే పోలీసు దగ్గరికి రైల్వే స్టేషన్లలో పాపాడ్స్ అమ్ముకునే బతికే పిల్లలు విధిగా ఏం భయం లేకుండా వెళుతుంటే. అది కూడా టైం అయింది రండి పాఠాలు చెప్తురుగానీ అని ఆయనను పిలిస్తే.. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో రోజూ ఇదే జరుగుతుంది. అప్పటి వరకు ఏ పోలీసులు వచ్చిన తమను పాపాడ్స్ అమ్ముకోనివ్వకుండా దెబ్బలు కొట్టి జీపులో ఎక్కించుకెళ్లే పోలీసులు, తన్ని తరిమేసి పోలీసులను చూసిన అక్కడి మురికివాడల్లో నివసించే పిల్లలు తొలిసారి మానవత్వాన్ని, సేవాగుణాన్ని ఓ పోలీసు రూపంలో బహుమానంగా పొందారు. ప్రేమగా దగ్గరకు తీసుకొని ఓపికతో విద్యాబుద్ధులు నేర్పించే గురువులాంటి పోలీసుకు చిక్కారు. దీంతో వారు రోజంతా ఏం చేసినా కచ్చితంగా ఓ గంటపాటు తప్పకుండా పుస్తకం పట్టాల్సిందే నాలుగు అక్షరాలు నేర్చుకోవాల్సిందే. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉండే స్లమ్ ఏరియాలోని పిల్లలు ప్రతి రోజు పాపాడ్స్ అమ్ముకునేందుకు రైల్వేస్టేషన్‌కు రావడం, అమ్ముకుంటుండటం, అప్పుడప్పుడు వారిలో వారే కొట్టుకోవడం, ఒక క్రమ పద్ధతిలేకుండా జీవించడం పరిపాటి. కొన్నిసార్లు పోలీసుల చేతికి చిక్కితే కొట్టి జీపులో తీసుకొని వెళ్లేవారు. అయితే, గత నాలుగు నెలల కిందట ధరమ్ వీర్ సింగ్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా అక్కడి స్టేషన్ కు వచ్చాడు. అయితే, ఆ పిల్లల గురించి అతడు కొత్తగా ఆలోచించి రోజు గంటపాటు చదువుకోవాలని ఆ తర్వాత పాపాడ్స్ అమ్ముకునేందుకు అనుమతిస్తానని చెప్పాడు. అలా ఆ పిల్లలు, కానిస్టేబుల్ మధ్య ఒప్పందం కుదుర్చుకొని అప్పటి నుంచి ఆ స్టేషన్ ప్రాంగణంలోని ఓ చోటు ప్లాట్ ఫాం పాఠశాలగా మారింది. ధరమ్ వీర్ సింగ్ చూపిస్తున్న మానవత్వం, సేవాదృక్పథంపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఇటుకతో దాడిచేసిన హెడ్‌కానిస్టేబుల్‌కు బెయిలు
సాక్షి, న్యూఢిల్లీ: మహిళపై ఇటుక విసిరి వార్తల్లోకి ఎక్కిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సతీష్ చంద్రకు బెయిలు లభించింది. లంచం ఇవ్వనందుకు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ తనను ఇటుకతో కొట్డాడని ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలపై సతీష్ చంద్ర.. మహిళను లంచం అడిగినట్లుగా సరైన ఆధారాలు లభించనందున రూ.10 వేల పూచికత్తుపై బెయిలు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి రెండు పరస్పర విరుద్ధమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయని న్యాయమూర్తి నరోత్తమ్ కౌశల్ చెప్పారు. రెడ్లైడ్ ఉల్లంఘించినందుకు తనను ఆపిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రూ. 200 లంచం అడిగాడని, లంచం ఇవ్వకపోవడంతో తనపై ఇటుకతో దాడి చేశాడని ఓ మహిళ ఆరోపించింది. ఇందుకు సంబంధించి లభించిన వీడియో సాక్ష్యం ఆధారంగా ఢిల్లీ పోలీసులు హెడ్ కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి అరెస్టు చే శారు. న్యాయస్థానం అతన్ని 14 రోజుల న్యాయ నిర్బంధానికి పంపింది. కానీ ఆ తరువాత మరో ఆడియో క్లిప్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆడియో క్లిప్‌లో మహిళ హెడ్ కానిస్టేబుల్‌ను దూషించడం, చలాన్ చెల్లించడానికి నిరాకరించడం వంటివి రికార్డయ్యాయి. -
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి సాయం
న్యూఢిల్లీ: దోపిడీ దొంగల చేతిలో హత్యకు గురైన ఒక కానిస్టేబుల్ కుటుంబానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఢిల్లీ శివారులోని విజయ విహార్ ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జగ్బీర్ సింగ్(42)ను రెండు రోజుల క్రితం అయిదుగురు దోపిడీ దొంగలు హత్య చేశారు. కానిస్టేబుల్ జగ్బీర్ సింగ్ విధి నిర్వహణలో ప్రాణాలు వదిలినందుకు, అతని కుటుంబానికి ఈ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నజీబ్ జంగ్ తెలిపారు. 15 సంవత్సరాలు ఆర్మీలో పని చేసిన జగ్బీర్ సింగ్ 2008లో ఢిల్లీ పోలీస్ శాఖలో చేరారు. ఆయన రెండుసార్లు బెస్ట్ బీట్ కానిస్టేబుల్‌గా అవార్డు కూడా అందుకున్నారు. **