కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి సాయం | Jung announces Rs one crore compensation for constable family | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి సాయం

Published Wed, Oct 15 2014 8:24 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్

న్యూఢిల్లీ: దోపిడీ దొంగల చేతిలో హత్యకు గురైన ఒక కానిస్టేబుల్ కుటుంబానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఢిల్లీ శివారులోని విజయ విహార్ ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జగ్బీర్ సింగ్(42)ను రెండు రోజుల క్రితం అయిదుగురు దోపిడీ దొంగలు హత్య చేశారు.

కానిస్టేబుల్ జగ్బీర్ సింగ్ విధి నిర్వహణలో ప్రాణాలు వదిలినందుకు, అతని కుటుంబానికి ఈ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నజీబ్ జంగ్ తెలిపారు.  15 సంవత్సరాలు ఆర్మీలో పని చేసిన జగ్బీర్ సింగ్ 2008లో ఢిల్లీ పోలీస్ శాఖలో చేరారు. ఆయన రెండుసార్లు బెస్ట్ బీట్ కానిస్టేబుల్గా అవార్డు కూడా అందుకున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement