న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై భారత మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏని భారత స్వయంకృత అపరాధంగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో సీఏఏపై నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. సీఏఏ భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశ ఆలోచనను మనం మార్చాలనుకుంటే దాని ఫలితంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా 2015కు ముందు దేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్లు, హిందువులు,సిక్కులు, జైనులు, పార్శీ మతస్తులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అయితే ఈ చట్టం వల్ల సంబంధిత దేశాల నుంచి వచ్చే ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని శివశంకర్ మీనన్ తెలిపారు.( ‘సీఏఏకు మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వండి’)
ఇదే సమావేశానికి హాజరైన ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మాట్లాడుతూ.. జామియా మిలీయా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడాన్ని తప్పుబట్టారు. సీఏఏపై సరైన సమాచారం ప్రజలకు చేరనందునే పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు సీఏఏపై పూర్తి అవగాహన కల్పిస్తే బాగుంటుందని నజీబ్‌జంగ్ వెల్లడించారు.(ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే..)
Comments
Please login to add a commentAdd a comment