former National Security Adviser
-
మైఖెల్ ఫ్లిన్కు ట్రంప్ క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖెల్ ఫ్లిన్కు క్షమాభిక్షకు ప్రసాదించారు. 2016 ఎన్నికల్లో రష్యా ప్రమేయానికి సంబంధించి ఎఫ్‌బీఐ ముందు తప్పుడు వివరాలిచ్చారని ఫ్లిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిన్కు క్షమాభిక్ష ప్రకటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫ్లిన్‌ను ఎప్పుడూ ప్రాసిక్యూట్ చేయలేదని, అలాగే ఫ్లిన్ కేసుపై న్యాయశాఖ జరిపిన స్వతంత్ర దర్యాప్తు సైతం క్షమాభిక్షను సమర్ధించిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రమైన అవినీతికి నిదర్శనమని డెమొక్రాట్ నేతలు దుయ్యబట్టారు. తన పదవీ అధికారాలను ట్రంప్ అసంబద్దంగా ఉపయోగిస్తున్నారన్నారు. ఫ్లిన్ చర్యలు జాతీయ భద్రతకు ముప్పని, క్షమాభిక్ష తగదని విమర్శించారు. -
'సీఏఏ దేశాన్ని ఏకాకిని చేయబోతోంది'
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై భారత మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏని భారత స్వయంకృత అపరాధంగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో సీఏఏపై నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. సీఏఏ భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశ ఆలోచనను మనం మార్చాలనుకుంటే దాని ఫలితంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా 2015కు ముందు దేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్లు, హిందువులు,సిక్కులు, జైనులు, పార్శీ మతస్తులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అయితే ఈ చట్టం వల్ల సంబంధిత దేశాల నుంచి వచ్చే ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని శివశంకర్ మీనన్ తెలిపారు.( ‘సీఏఏకు మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వండి’) ఇదే సమావేశానికి హాజరైన ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మాట్లాడుతూ.. జామియా మిలీయా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడాన్ని తప్పుబట్టారు. సీఏఏపై సరైన సమాచారం ప్రజలకు చేరనందునే పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు సీఏఏపై పూర్తి అవగాహన కల్పిస్తే బాగుంటుందని నజీబ్‌జంగ్ వెల్లడించారు.(ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే..) -
'మేం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం వేరు'
న్యూఢిల్లీ : గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని... అయితే వారిని బహిర్గతం చేయలేదని యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో శివశంకర్ మీనన్ మాట్లాడుతూ... తాము నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం వేరని తెలిపారు. దేశంలో ప్రజల మనోభావాలను మేనేజ్ చేయడం వాటి లక్ష్యం కాదన్నారు. చొరబాట్లు జరగకుండా నిరోధించడమే వాటి లక్ష్యం అని పేర్కొన్నారు. అప్పటి ఆపరేషన్ వివరాలు వెల్లడించనందుకు చింతించడం లేదని శివ శంకర్ మీనన్ చెప్పారు. పాక్ అక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ ఆర్మీ ఇటీవల సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. -
క్లింటన్ సలహాదారు మృతి
వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన శాండీ బర్గర్(70) చనిపోయాడు. తీవ్ర అనారోగ్యం వల్లే అతడు ప్రాణాలువిడిచినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే, ఆ అనారోగ్యం ఏమిటనే విషయంపై మాత్రం కచ్చితమైన ప్రకటన ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనకు భద్రతా సలహాదారుగా శాండీ నియామకం అయ్యారు. ఆ సమయంలో నిర్వహించిన విదేశాంగ వ్యవహార బాధ్యతల్లో విలువైన పత్రాల భద్రత విషయంలో విఫలమై విమర్శల పాలయ్యారు. 1997-2001 మధ్య ఆయన ఈ బాధ్యతలు నిర్వహించారు. ఇరాక్ లోని సద్దాం హుస్సేన్ పై, కోసావో ప్రాంతంపై వైమానిక దాడులు జరిపిన సమయంలో ఇతడే జాతీయ భద్రతా సలహాదారు. అమెరికా ఇతర దేశాలతో స్వేచ్ఛాయుత వ్యాపారం చేసేందుకు కారణమైనవారిలో శాండీ కూడా ఒకరు.