క్లింటన్ సలహాదారు మృతి
వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన శాండీ బర్గర్(70) చనిపోయాడు. తీవ్ర అనారోగ్యం వల్లే అతడు ప్రాణాలువిడిచినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే, ఆ అనారోగ్యం ఏమిటనే విషయంపై మాత్రం కచ్చితమైన ప్రకటన ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనకు భద్రతా సలహాదారుగా శాండీ నియామకం అయ్యారు.
ఆ సమయంలో నిర్వహించిన విదేశాంగ వ్యవహార బాధ్యతల్లో విలువైన పత్రాల భద్రత విషయంలో విఫలమై విమర్శల పాలయ్యారు. 1997-2001 మధ్య ఆయన ఈ బాధ్యతలు నిర్వహించారు. ఇరాక్ లోని సద్దాం హుస్సేన్ పై, కోసావో ప్రాంతంపై వైమానిక దాడులు జరిపిన సమయంలో ఇతడే జాతీయ భద్రతా సలహాదారు. అమెరికా ఇతర దేశాలతో స్వేచ్ఛాయుత వ్యాపారం చేసేందుకు కారణమైనవారిలో శాండీ కూడా ఒకరు.