వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖెల్ ఫ్లిన్‌కు క్షమాభిక్షకు ప్రసాదించారు. 2016 ఎన్నికల్లో రష్యా ప్రమేయానికి సంబంధించి ఎఫ్‌బీఐ ముందు తప్పుడు వివరాలిచ్చారని ఫ్లిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిన్‌కు క్షమాభిక్ష ప్రకటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫ్లిన్‌ను ఎప్పుడూ ప్రాసిక్యూట్ చేయలేదని, అలాగే ఫ్లిన్ కేసుపై న్యాయశాఖ జరిపిన స్వతంత్ర దర్యాప్తు సైతం క్షమాభిక్షను సమర్ధించిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రమైన అవినీతికి నిదర్శనమని డెమొక్రాట్ నేతలు దుయ్యబట్టారు. తన పదవీ అధికారాలను ట్రంప్ అసంబద్దంగా ఉపయోగిస్తున్నారన్నారు. ఫ్లిన్ చర్యలు జాతీయ భద్రతకు ముప్పని, క్షమాభిక్ష తగదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment