michael flynn
-
మైఖెల్ ఫ్లిన్కు ట్రంప్ క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖెల్ ఫ్లిన్కు క్షమాభిక్షకు ప్రసాదించారు. 2016 ఎన్నికల్లో రష్యా ప్రమేయానికి సంబంధించి ఎఫ్‌బీఐ ముందు తప్పుడు వివరాలిచ్చారని ఫ్లిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిన్కు క్షమాభిక్ష ప్రకటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫ్లిన్‌ను ఎప్పుడూ ప్రాసిక్యూట్ చేయలేదని, అలాగే ఫ్లిన్ కేసుపై న్యాయశాఖ జరిపిన స్వతంత్ర దర్యాప్తు సైతం క్షమాభిక్షను సమర్ధించిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రమైన అవినీతికి నిదర్శనమని డెమొక్రాట్ నేతలు దుయ్యబట్టారు. తన పదవీ అధికారాలను ట్రంప్ అసంబద్దంగా ఉపయోగిస్తున్నారన్నారు. ఫ్లిన్ చర్యలు జాతీయ భద్రతకు ముప్పని, క్షమాభిక్ష తగదని విమర్శించారు. -
అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం
సెనెట్ కమిటీ ముందు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ కోమీ సాక్ష్యం ► ఫ్లిన్‌పై విచారణ ఆపమనడంతో ఆందోళన చెందా.. ఆదేశంగా భావించా.. ► దర్యాప్తు అడ్డుకోమని సూటిగా ట్రంప్ చెప్పలేదు.. వాషింగ్టన్: ఏకపక్షంగా, స్వలాభం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అతని మెడకు చుట్టుకుం టున్నాయి. చివరకు అధ్యక్ష పీఠానికే ఎసరు తెచ్చేలా చకాచకా పరిణామాలు మారిపోతు న్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తును ట్రంప్ పరోక్షంగా ప్రభావి తం చేశారని ఆరోపించిన ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ.. గురువారం సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు ఆ మేరకు బహిరంగంగా సాక్ష్యమిచ్చారు. ట్రంప్ ముఖ్య అనుచరుడైన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్‌పై విచారణ ఆపాలని ట్రంప్ కోరడం తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, ఆ సమయంలో ఆయన కోరికను ఆదేశంగా భావించానని కమిటీ సభ్యులకు కోమీ వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని రష్యా ప్రభావితం చేసిందని సెనెట్ కమిటీకి స్పష్టం చేశారు. ట్రంప్ యంత్రాంగం తనను అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించడంతో పాటు ఎఫ్ఐబీపై అబద్ధాలు ప్రచారం చేసిందన్నారు. ఫ్లిన్‌పై విచారణ ఆపాలని కోరుతూ.. న్యాయప్రక్రియకు ట్రంప్ విఘాతం కలిగించారా? అన్న ప్రశ్నకు మాత్రం కోమీ సూటిగా సమాధానమివ్వలేదు. ట్రంప్ ఆదేశాన్ని తానలా భావించలేదని బదులిచ్చారు. కోమీ వాంగ్మూలం ఆయన మాటల్లోనే... ట్రంప్ తప్పుడు ప్రచారం ఎఫ్‌బీఐ అస్తవ్యస్తంగా తయారైందని, ఎఫ్‌బీఐ ప్రతినిధులు డైరెక్టర్ పట్ల నమ్మకాన్ని కోల్పోయారంటూ అమెరికా ప్రజలకు ట్రంప్ అబద్ధాలు చెప్పారు. చట్ట ప్రకారం ఎఫ్‌బీఐ డైరక్టర్‌ను తొలగించేందుకు ఎలాంటి కారణాలు అవసరం లేకపోయినా నన్ను తొలగించేందుకు చూపిన కారణాలు అతి సాధారణంగా ఉన్నాయి. నా గురించి అటార్నీ జనరల్స్ తో పాటు అనేక మందితో మాట్లాడానని, అద్భుతంగా పనిచేస్తున్నట్లు తేలిందని, ఎఫ్‌బీఐ బృందం కూడా నన్ను ఎంతో ఇష్టపడుతున్నట్లు ట్రంప్ నాకు చెప్పారు. అయితే మే 9న మాత్రం అందుకు వ్యతిరేకంగా నన్ను పదవి నుంచి తప్పించారు. నేను అద్భుతంగా పనిచేస్తున్నానని, నన్ను కొనసాగించాలని అనుకుంటున్నట్లు ట్రంప్ పదేపదే చెప్పారు. ఒక్కసారిగా అవాక్కయ్యా.. ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యాను. ఫ్లిన్‌పై విచారణను ఇంతటితో వదిలేయాలన్న విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నా.. ఫ్లిన్‌ను వదిలేయండి అని ట్రంప్ కోరార’ని కోమీ చెప్పారు. ఈ సందర్భంగా సెనెటర్ డియన్నె ఫెయిన్స్టెన్ జోక్యం చేసుకుంటూ ..‘ ఫ్లిన్‌పై విచారణను ఆపమనడం తప్పని ట్రంప్‌ను ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ‘ఆ సంభాషణతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా’నని కోమీ సమాధానమిచ్చారు. నమ్మించి మోసగించారు.. ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం జనవరి 27న ఆయనతో విందులో పాల్గొన్నాను. నాకు మద్దతుగా ఉన్నట్లు నమ్మించేందుకు అధ్యక్షుడు ప్రయత్నించారని నాకు అర్థమైంది. నాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని ట్రంప్ చెప్పారు. నన్ను కొనసాగించే అంశంపై మూడుసార్లు మాట్లాడుకున్నాం. అయితే అందుకు ప్రతిఫలంగా ట్రంప్ ఏదో ఆశిస్తున్నారని అప్పుడు నాకనిపించింది. ట్రంప్ మూడు అంశాలు నా నుంచి ఆశించారు. ఒకటి విధేయత, రెండు ఫ్లిన్‌పై విచారణ ఆపడం, ట్రంప్‌పై ఎలాంటి విచారణ జరగడం లేదని బహిరంగంగా ప్రకటించడం. ముందు జాగ్రత్తగానే మీటింగ్ నోట్స్.. ట్రంప్‌తో మొదటి సమావేశం నుంచి నా తొలగింపు వరకూ అధ్యక్షుడితో మీటింగ్ నోట్స్ తీసుకున్నాను. ట్రంప్‌తో చర్చించిన అంశాలపై ఆయన అబద్ధం ఆడవచ్చనే ఉద్దేశ్యంతో ముందే జాగ్రత్త పడ్డాను. ట్రంప్‌తో వ్యక్తిగత సంభాషణాల్ని బయటపెడితే.. ట్రంప్ యంత్రాంగం చర్యల్ని విచారించేందుకు ప్రత్యేక కౌన్సిల్ నియమిస్తారని భావించి అలా చేశాను. ట్రంప్‌పై ప్రత్యేకంగా మాత్రం ఎలాంటి విచారణ జరగలేదు. అయితే ఈ కేసులో ట్రంప్ ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వారి జోక్యం నిజం 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఉద్దేశపూ ర్వకంగానే రష్యా జోక్యం చేసుకుందని సెనెట్ సభ్యులకు కోమీ స్పష్టం చేశారు. రష్యా జోక్యం అవాస్తవమని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యా జోక్యంపై లభించిన ఆధారాలు నిజమేనని కోమీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ ఆపమని ఏ సందర్భంలోనైనా ట్రంప్ కోరారా? అని సభ్యులు ప్రశ్నించగా.. లేదు అని కోమీ సమాధానమిచ్చారు. కేవలం ఫ్లిన్‌పై విచారణ ఆపమని మాత్రమే ట్రంప్ కోరినట్లు చెప్పారు. -
‘ఆయన అద్భుతం.. మీడియానే ఫేక్’
వాషింగ్టన్: మీడియా అంటేనే దుమ్మెత్తిపోసే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి శివమెత్తారు. తమ దేశ జాతీయ భద్రత సలహాదారుడు, ట్రంప్‌కు అత్యంత అనుంగుడు మైఖెల్ ఫ్లిన్ రాజీనామా చేయడంపై మీడియా మొత్తం అబద్ధాలు వల్లేవేసిందని, అదొక బూటకపు మీడియా అని, అలాంటి వార్తలు లీకులివ్వడం చట్ట విరుద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం సాయంత్రం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలసి మాట్లాడుతూ మీడియా ఫ్లిన్‌ను చాలా చెత్తగా ట్రీట్ చేసిందని పేర్కొన్నారు. ఆయన నిర్ణయానికి సానుకూలంగా ఒక్క మీడియా కూడా రాయలేదని మండిపడ్డారు. రష్యాతో సంబంధాలు నెరుపుతున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తనపై విశ్వాసం కోల్పోయారనే భావనలో రాజీనామా చేశారు తప్ప ఆయన తప్పు చేసి రాజీనామా చేయలేదని వెనుకేసుకొచ్చారు. ఫ్లిన్ ఒక అద్భుతమైన వ్యక్తి అని చెప్పారు. మీడియానే అతడిని అన్‌ఫెయిర్‌గా వార్తలు వండివార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రాట్లు పెద్ద మొత్తంలో తన చేతుల్లో దెబ్బతిన్న తర్వాత ఆ విషయం ప్రజల్లో కవర్ చేసుకునేందుకు ఫ్లిన్ రాజీనామా విషయాన్ని పావుగా వాడుకుంటూ మీడియా సహాయంతో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఫ్లిన్ రాజీనామా తర్వాత ట్రంప్ తొలిసారి దానిపై స్పందించారు. -
హెచ్1బీతో అమెరికా కంపెనీలకే లాభం
భారత రాయబారి నవతేజ్ సర్నా వాషింగ్టన్ : హెచ్1బీ వీసాల వల్ల అమెరికా కంపెనీలకే లాభమని ఆ దేశంలోని భారత రాయబారి నవతేజ్ సర్నా చెప్పారు. ఈ వీసాల ద్వారా అమెరికా కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతోపాటు సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుందని, స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. అమెరికాలో నిజానికి ఉద్యోగాలు సృష్టిస్తున్నది భారతీయ టెక్నాలజీ పరిశ్రమేనని మంగళవారం సీఎన్ఎన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూ లో చెప్పారు. ‘అమెరికాలో 4 లక్షల కొత్త కొలువులు వచ్చే అవకాశముందని చట్టసభలే చెప్పాయి. భారతీయ కంపెనీలు గత నాలుగేళ్లలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి, 20 బిలియన్ల పన్నులు చెల్లించాయి. ప్రతి 100 హెచ్1బీ వీసాల వల్ల అమెరికాలో 183 ఉద్యోగాలకు చేయూత లభిస్తోంది. భారత్‌లో టాప్ 15 టెక్ కంపెనీల్లో 9 అమెరికా కంపెనీలే. ఈ అనుబంధం వల్ల ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయి’ అని చెప్పారు. భద్రతా సలహాదారు రాజీనామా రష్యాతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఫ్లిన్ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చేపడుతున్న కార్యకలాపాల వివరాలను రష్యా రాయబారితో చర్చించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. -
ట్రంప్ టీంలో అప్పుడే కీలక వికెట్ ఔట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టీంలో కీలక వికెట్ పడిపోయింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పటి నుంచి ప్రచారం.. నేడు అధికారాన్ని కైవసం చేసుకునేంత వరకు ట్రంప్‌కు చేదోడువాదోడుగా ఉంటూ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ముఖ్యపాత్ర పోషించిన ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖెల్ ప్లిన్ రాజీనామా చేశారు. రష్యాతో అతడు సంబంధాలు పెట్టుకున్నాడని, దాని కారణంగా ట్రంప్ పరిపాలన వర్గంలో ఆందోళనలు బయలుదేరాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతడు తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రష్యాతో సంబంధాలు పెట్టుకున్న ఫ్లిన్ ట్రంప్ పరిపాలన వర్గాన్ని తప్పుదారి పట్టిస్తున్నట్లు గట్టి ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ అధికారం చేపట్టి నెల రోజులు కూడా పూర్తవ్వకముందే జరిగిన ఈ పరిణామం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ట్రంప్ మద్దతు దారుల్లో ఫ్లిన్ మాత్రమే అత్యంత విశ్వసనీయుడు. తొలుత తన సీనియర్ సహచర అధికారులతో మాట్లాడిన ఫ్లిన్ తాను రష్యాతో అసలు సంబంధాలు పెట్టుకోవడం లేదని, వారికి కొన్ని అవకాశాలు ఇచ్చే యోచన చేయడం లేదని చెప్పారు. తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా రాయబారితో చర్చలు జరిపే అవకాశం ఉండొచ్చు అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై అధికారుల మధ్య ఆందోళనలు బయలుదేరాయి. -
ట్రంప్ నమ్మినబంటుకి కీలక పదవి!
వాషింగ్టన్: తన విశ్వాసపాత్రుడికి కీలక పదవి కట్టబెట్టేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్తుడైన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మైఖేల్ ఫ్లిన్ ను అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియమించాలని ట్రంప్ భావిస్తున్నారు. నిఘా అధికారిగా పనిచేసిన 56 ఏళ్ల ఫ్లిన్ ముక్కుసూటి మనిషిగా పేరుంది. కొంతకాలంగా ట్రంప్ కు ఆయన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. తీవ్రవాదులకు చేయూతనివ్వడం మానుకోకుంటే పాకిస్థాన్ కు అమెరికా అందిస్తున్న ఆర్థిక సహాయం నిలిపివేయాలని ఫ్లిన్ తన పుస్తకంలో రాశారు. ఉగ్రవాదానికి అంతం చేయడానికి అవసరమైతే రష్యాతో చేతులు కలపాలని ట్రంప్ కు సలహాయిచ్చింది ఆయనేనని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఒకవేళ ఫ్లిన్ అమెరికా భద్రత సలహారుగా ఎంపికైతే సుసాన్ రైస్ స్థానంలో బాధ్యతలు చేపడతారు.