ట్రంప్ టీంలో అప్పుడే కీలక వికెట్ ఔట్
రష్యాతో సంబంధాలు పెట్టుకున్న ఫ్లిన్ ట్రంప్ పరిపాలన వర్గాన్ని తప్పుదారి పట్టిస్తున్నట్లు గట్టి ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ అధికారం చేపట్టి నెల రోజులు కూడా పూర్తవ్వకముందే జరిగిన ఈ పరిణామం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ట్రంప్ మద్దతు దారుల్లో ఫ్లిన్ మాత్రమే అత్యంత విశ్వసనీయుడు.
తొలుత తన సీనియర్ సహచర అధికారులతో మాట్లాడిన ఫ్లిన్ తాను రష్యాతో అసలు సంబంధాలు పెట్టుకోవడం లేదని, వారికి కొన్ని అవకాశాలు ఇచ్చే యోచన చేయడం లేదని చెప్పారు. తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా రాయబారితో చర్చలు జరిపే అవకాశం ఉండొచ్చు అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై అధికారుల మధ్య ఆందోళనలు బయలుదేరాయి.