రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్
చాంద్రాయణగుట్ట : ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు నగర పోలీస్ కమిషనర్ ప్రయత్నిస్తుంటే... ఛత్రినాకలో ఓ హెడ్ కానిస్టేబుల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చిన బాధితురాలితో వివాహేతర సంబంధంపెట్టుకొని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో మధుసూదన్‌రెడ్డి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. సాయిబాబానగర్‌కు చెందిన మహిళ (33) తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు పలుమార్లు స్టేషన్‌కు వచ్చేది. ఈ సమయంలోనే బాధిత మహిళతో చనువు పెంచుకున్న హెడ్ కానిస్టేబుల్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
భర్త లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లేవాడు. విషయం తెలుసుకున్న భర్త ఆదివారం రాత్రి తన భార్యతో హెడ్‌కానిస్టేబుల్ గదిలో ఉండగా బయటి నుంచి తలుపుపెట్టి.. బస్తీవాసులను పిలిచాడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి హెడ్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సదరు హెడ్‌కానిస్టేబుల్‌ను ఛత్రినాక నుంచి కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బాధితురాలితో వివాహేతర సంబంధం
Published Mon, Sep 21 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM
Advertisement
Advertisement