దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారన్న సామెత విన్నాం కానీ.. దొంగలు ..పోలీసులు చేతులు కలిపిన వైనంఎపుడూ కనలేదు. తాజాగా దేశరాధాని ఢిల్లీలో ఇలాంటి ఆశ్చర్యకరమైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ లో మహిళా దొంగలతో చేతులు కలిపిన పోలీసాయన యవ్వారాన్ని అక్కడి సీసీటీవీ బట్టబయలు చేసింది. సీసీటీవీ రికార్డైన దృశ్యాల ప్రకారం గోల్డ్ ఆభరణం కొట్టేసిన మహిళా దొంగ నుంచి తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ దాన్ని గుట్టు చప్పుడు కాకుండా తన జేబులో వేసుకుని చల్లగా జారుకున్నాడు. మరోవైపు బాధిత మహిళ భర్తతో కలిపి తీసుకున్న సెల్ఫీ ఆధారంగా ఆరుగురు సభ్యుల మహిళా దొంగల గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.