భార్యకు అడ్డంగా దొరికిన ‘హెడ్డు’ .. ఏంచేశాడంటే.. | Head Constable Extra Marital Affair In Khammam | Sakshi
Sakshi News home page

భార్యకు అడ్డంగా దొరికిన ‘హెడ్డు’ .. ఏంచేశాడంటే..

Aug 6 2021 2:33 PM | Updated on Aug 6 2021 2:41 PM

Head Constable Extra Marital Affair In Khammam - Sakshi

నిలదీస్తున్న మహిళ

సాక్షి, పాల్వంచ(ఖమ్మం): మరో మహిళతో కలిసి ఉన్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను భార్య పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పాల్వంచలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..కొత్తగూడెం 6వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ గడ్డం రాజేష్‌ పాల్వంచ బొల్లేరుగూడెంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు పదేళ్ల క్రితం స్వప్నతో వివాహం జరగగా, ఆరేళ్ల పాప ఉంది. అనంతరం వీరి నడుమ విబేధాలు తలెత్తడంతో కేసులు కోర్టు పరిధిలో నడుస్తున్నాయి.

ఇదిలా ఉండగా రాజేష్‌ వేరే మహిళతో ఉంటున్నాడనే సమాచారంతో గురువారం స్వప్న మహిళా సంఘం నాయకులతో కలిసి బొల్లేరుగూడెంలోని ఇంటికి చేరుకోగా..ఇద్దరూ కలిసి ఉండగా పట్టుకుంది. ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ..గతంలో తనను చిత్రహింసలు పెట్టగా అధికారులు సస్పెండ్‌ చేశారని తెలిపింది. అయినా ఇప్పుడు మరో మహిళతో ఉన్నాడని తెలుసుకుని వచ్చానని చెప్పింది. ఈమేరకు స్వప్న ఫిర్యాదుతో రాజేష్‌తో పాటు ఆయనతో కలిసి ఉన్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జె.ప్రవీణ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement