Khammam Crime News: Wife Assassinated Husband Over Extramarital Affair Khammam - Sakshi
Sakshi News home page

Extra Marital Affair​:‍ వాటర్‌మెన్‌తో పరిచయం, భర్తతో కలిసి ఉండలేక..

Published Tue, Apr 5 2022 10:16 AM | Last Updated on Tue, Apr 5 2022 12:24 PM

Wife Assassinated Husband Over Extramarital Affair Khammam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,తిరుమలాయపాలెం(ఖమ్మం): తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్త తాగే మద్యంలో విషం (కుక్కలను సంహరించే మందు) కలిపి హతమార్చిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆమెకు సహకరించిన ప్రియుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన దావా కనకరాజు (37)కు భార్య విజయతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు గ్రామానికే చెందిన పంచాయతీ వాటర్‌మెన్‌ ఓర పాపయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం బయటపడటంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది.

దీంతో విజయ పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పాపయ్యతో ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి నిర్ణయించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం తుమ్మగూడెంలో కృష్ణ అనే వ్యక్తి వద్ద కుక్కల మందు కొనుగోలు చేసి గతనెల 30న రాత్రి సమయంలో షేక్‌ మస్తాన్‌ ద్వారా ఓ మద్యం బాటిల్‌లో కలిపి కనకరాజుకి ఇవ్వాలని చెప్పి పంపించారు. ఆ మందు తాగిన కనకరాజు ఇంటికి వెళ్లాక కాళ్లు, చేతులు లాగుతున్నాయని చెప్పడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని, మద్యంలో విషం కలిపి ఉంటారని తల్లి భద్రమ్మ ఫిర్యాదు చేసింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు తన భర్త అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే విజయ ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని పోలీసుల వి చారణలో తేలింది. దీంతో ఓర పాపయ్య, దావా విజయను సోమవారం అరెస్టుచేసి రిమాండ్‌కు త రలించినట్లు కూసుమంచి సీఐ సతీశ్‌ తెలిపారు.

చదవండి: ప్రియుడితో షికార్లు.. గర్భం దాల్చడంతో వైద్యం కోసం యూట‍్యూబ్‌ చూసి.. ఆ తర్వాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement