గోదావరి పుష్కర విధులు నిర్వహిస్తూ శనివారం సాయంత్రం గుండెపోటుకు గురైన హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు(45) ఆదివారం ఉదయం చనిపోయారు.
భద్రాచలం(ఖమ్మం): ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి పుష్కర విధులు నిర్వహిస్తూ శనివారం సాయంత్రం గుండెపోటుకు గురైన హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు(45) ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చనిపోయారు. ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలకేంద్రం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.