అన్నం తిన్న ఇంటికే కన్నం వేశాడు | Robbery in constable house | Sakshi
Sakshi News home page

అన్నం తిన్న ఇంటికే కన్నం వేశాడు

Published Wed, Sep 2 2015 12:29 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery in constable house

మహబూబ్‌నగర్ : దొంగల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల ఇంట్లోనే దొంగలు పడి రూ. 25 తులాల బంగరు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు... కాలనీకి చెందిన వెంకట్రాములు మహిళా పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పరిచయస్థుడు రోడ్డు మీద కనిపించడంతో.. అతన్ని ఇంటకి పిలిచి భోజనం పెట్టించాడు. అనంతరం అత్యవసర పనిమీద వెంకట్రాములు భార్యతో కలసి బయటకు వెళ్లడంతో.. ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న 25 తులాల బంగారంతో ఉడాయించాడు. ఇంటికి తిరిగి వచ్చిన దంపతులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement