కేసులు వద్దు..మామూళ్లే ముద్దు | Sub-Divisional Police Officer do corruption, | Sakshi
Sakshi News home page

కేసులు వద్దు..మామూళ్లే ముద్దు

Published Mon, May 19 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

కేసులు వద్దు..మామూళ్లే ముద్దు

కేసులు వద్దు..మామూళ్లే ముద్దు

 ఆయన అర్బన్  పరిధిలోని ఓ సబ్‌డివిజనల్ పోలీస్ అధికారి. ఉన్నతాధికారులను తన వినయవిధేయతలతో బురిడీ కొట్టించే సదరు అధికారి వసూళ్లలో రారాజు. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే కట్టడి చేయాల్సిన సదరు సారు టార్గెట్లు విధించి, వేధించి మరీ మామూళ్లు రాబడుతున్నారు. బార్, వైన్‌‌సషాపుల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని హుకుం జారీచేస్తున్నారు. మామూళ్లు వసూలు చేయలేమని చేతులెత్తేసిన వారిని శాఖాపరంగా ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మాట వినని వ్యాపారులను తన ఇంటికి పిలిపించుకుని మరీ దారికి తెస్తున్నారు. సివిల్ సెటిల్‌మెంట్లలో తలదూర్చడం నిత్యకృత్యంగా మారిన డీఎస్పీ అక్రమాలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం...
 
దరు సబ్‌డివిజనల్ అధికారి మొదటగా బార్, వైన్స్ షాపులపై దృష్టి సారిం చారు. డివిజన్ పరిధిలో వీటి నుంచి ప్రతీ నెలా రూ. 1.20 లక్షలు మామూళ్ల రూపంలో ఆయా షాపుల నుంచి వసూలు చేస్తున్నారు. మద్యం ముడుపుల కేసులో కొందరు పోలీస్ అధికారులపై ఏసీబీ  విచారణ కొనసాగుతున్నా సదరు అధికారి మాత్రం పాత పద్ధతిలోనే డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్యం షాపులు సరిగ్గా నడవక యజమానులు డబ్బులు ఇవ్వకపోవడంతో రెండు నెలలుగా ఓ స్టేషన్ నుంచి రావాల్సిన మామూళ్లు ఆగిపోయూరుు. దీంతో సదరు అధికారి అక్కడి ఎస్‌హెచ్‌ఓపై  చిర్రుబుర్రులాడినట్లు తెలిసింది. అలాగే ఇసుక దందా ఎక్కువగా నడిచే ఒక్కో పోలీస్‌స్టేషన్ నుంచి నెలకు రూ.60 వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం.
 
 ఐడీ పార్టీ కానిస్టేబుళ్లతో దందా..
 తన వద్ద ఉన్న ఐడీ పార్టీ కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్‌తోనేదందా మొత్తం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక ట్రాక్టర్ల వ్యవహారం, బార్‌లు, గ్రానైట్‌లు అన్నింటి వద్ద ఈ కానిస్టేబుళ్లే వ్యవహారం చక్కబెడుతున్నారు. ఈ ఇద్దరే సదరు అధికారి పరిధిలోని స్టేషన్లలో సివిల్ తగాదాల్లో తలదూర్చుతూ సార్‌కు కనకవర్షం కురిపిస్తున్నారు. భూవివాదాల్లో  ఒకవర్గం  పక్షాన వకల్తా పుచ్చుకుని సెటిల్‌మెంట్‌కో రేట్ నిర్ణయించి వివాదాలను తమదైన శైలిలో పరిష్కరిస్తున్నట్లు తెలిసింది. అంతేగాక రోడ్డు ప్రమాద కేసులు, వాహనాలకు సంబంధించిన సెటిల్‌మెంట్లు, ఇతర కీలక కేసుల్లోనూ వీరు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా నటిస్తూ ఇరుపక్షాల నుంచి డబ్బులు గుంజుతున్నారు.
 
 గ్రానైట్‌లారీలు.. క్రషర్లు..
 కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్ నగరం మీదు గా నిత్యం గ్రానైట్ లారీలు రాత్రి వేళల్లో వెళ్తుం టాయి. వీటిలో ఎక్కువగా సార్‌కు టచ్ లో ఉన్న గ్రానైట్ కంపెనీలకు సంబంధించినవే. ఈ డివి జన్ పరిధిలో ఎవరైనా కిందిస్థారుు ఉద్యోగి గ్రానైట్ లారీని  పట్టుకున్నా.. వారిపైకేసు పె ట్టినా డీఎస్పీ ఆగ్రహానికి గురికావాల్సిందే. ఎం దుకంటే ప్రతీనెలా రూ.60 వేల వరకు సదరు కంపెనీ యజమానుల నుంచి సార్‌కు డబ్బులు ముడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే సబ్‌డివిజన్ చివ ర్లో ఉండే స్టేషన్ పరిధిలో మూడు క్రషర్లు ఉన్నాయి. వీటి నుంచి ప్రతీ నెల రూ.20 వేల చొప్పున ముడుతున్నట్లు సమాచారం. వీరిలో ఓ క్రషర్ యజమాని ఓ నెల మామూళ్లు ఇవ్వకపోవడంతో చేసేదిలేక స్థానిక పోలీస్ అధికారే తన జేబులో నుంచి బాస్‌కు ఇచ్చినట్లు సమాచారం. ఈ స్టేషన్ పరిధిలోని వైన్‌‌స నుంచి కూడా రూ.20 వేలు సబ్‌డివిజనల్ అధికారికి చేరుతున్నాయనే  ఆరోపణలు ఉన్నారుు.
 
 సివిల్‌లో తగాదాలంటే ఇంట్రెస్ట్..
 సదరు అధికారికి సివిల్ తగాదాలంటే మక్కువ ఎక్కువ. ఎందుకంటే పెద్దమొత్తంలో డబ్బులు ఒక్కసారిగా వస్తాయి కాబట్టి. నగర శివారు సమీపంలో ఓ భూవివాదంలో తలదూర్చిన సదరు డీఎస్పీ పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని స్టేషన్‌లో బంధించాడు. ఇందుకు రూ.2 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే సివిల్ తగాదాలో తీసుకెళ్లిన సదరు వ్యక్తిని విడుదల చేయాలని ఒక రాజకీయ నాయకుడు ఉన్నతాధికారులను కూడా సంప్రదించారు. అయినా డీఎస్పీ ససేమిరా అన్నాడు. ఎంతకూ వదిలిపెట్టకపోవడంతో రాత్రి 9.30 గంటల ప్రాంతం లో డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన సదరు నాయకుడు డీఎస్పీ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు.
 
 అంతటితో ఆగకుండా పోలీసులు తీసుకొచ్చిన వ్యక్తిని తన వెంట తీసుకువెళ్లారు. ఇదంతా జరుగుతున్నా సదరు డీఎస్పీ ప్రేక్షకపాత్ర వహించాడు తప్పా ఏమి అనలేకపోయాడు. ఎక్కువగా మాట్లాడితే తన బండారం బయటపడుతుందని భయపడి డీఎస్పీ హోదాలో ఉన్నా ఆయన వెనుకంజ వేయడం అప్పట్లో చర్చనీయూంశంగా మారింది. ఇదే సబ్‌డివిజన్ పరిధిలో హైవే మీద ఉన్న ఒక పాఠశాల యూజమాన్యంలో పార్ట్‌నర్స్ మధ్య ఇటీవల గొడవలు వచ్చాయి. ఇరువర్గాలు ఒకరికి తెలియకుండా మరొకరు సదరు అధికారిని సంప్రదించారు. ఇంకేముంది ఒక వర్గం నుంచి రూ.2 లక్షలు, మరో వ ర్గం నుంచి రూ.3 లక్షలు వసూలు చేశాడు. ప్రస్తుతం ఈ పంచాయితీ కొనసాగుతోంది.
 
 ప్రొబేషనరీలకు అభయహస్తం..
 సదరు అధికారి పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో అం దరూ ప్రొబేషనరీ ఎస్సైలే విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన వీరికి అమ్యామ్యాల వసూళ్లపై అవగాహన తక్కువే. అలాం టివారికి విధుల్లో చేరిన కొద్దిరోజులకే అందరినీ తన చాంబర్‌కు పిలిపించుకుని నెలవారీ టార్గె ట్లు విధించారు. అప్పాలో కఠోర శిక్షణ పూర్తి చే సుకున్న ప్రొబేషనరీలకు సదరు అధికారి అవి నీతి పాఠాలు చెబుతున్నారు. వారికి ఆదాయ వ నరుల గుట్టు విప్పి వివరిస్తున్నారు. ‘మీకు నే నున్నా.. ఏమై నా నేను చూసుకుంటా.’ అని భ రోసా ఇచ్చారు. ప్రొబేషనరీ పిరియడ్‌లో తమ కు ఏమైనా రిమార్క్ వస్తే సర్వీస్‌లో ఇబ్బంది ఉంటుందని కొందరు ఎస్సైలు ఆందోళనకు గు రవుతున్నప్పటికీ బాస్ చెప్పినట్లు వినకుంటే ఇ బ్బందులు వస్తాయని మిన్నకుండిపోతున్నట్లు తెలిసింది.
 
 రచ్చకెక్కుతున్న విబేధాలు..
 డీఎస్పీ మామూళ్ల మత్తుతో అధికారులలో అభిప్రాయ బేధాలు తలెత్తుతున్నాయి. మామూళ్ల కోసం కిందిస్థాయి ఉద్యోగులను వేధించడం, వారిని పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ అనేకమార్లు అధికారుల మధ్య గొడవలు జరిగాయి. ఉన్నతాధికారి అని చూడకుండా కిందిస్థాయి ఉద్యోగులు పలుమార్లు ఆయనను నిలదీసిన సంఘటనలు అనేకం ఉన్నారుు.
 
 సారుకు కేసులంటే చిరాకు..
 పోలీసులకు తమ బాధను చెప్పుకోవడానికి వ చ్చే బాధితులంటే సారుకు యమచిరాకు. బాధితులు వందలాదిగా వస్తున్నా కేసులు మాత్రం నమోదు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరకట్న వేధింపుల కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడమంటే సుతార మూ ఆయనకు ఇష్టముండదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన సారుకు కేసులు వద్దు.. బాధితులు వద్దు.  కేవలం డబ్బులు ఇచ్చేవారు మాత్రమే కావాలి. ఇలాంటి అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించాలని  పలువురు బాధితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement