
కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎస్పీ
ఆదిలాబాద్: గుడిహత్నూర్ పోలీసుస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పాలకొండ శ్రీనివాస్ (49) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు రూ.20 వేలు ఎస్పీ అందించారు. ఎస్పీ వెంట పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పోలీసు టెలీకాన్ఫరెన్స్ నిర్వహణ అధికారి సింగజ్‌వార్ సంజీవ్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment