ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని ఆర్కె పురం పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ లింగం గౌడ్(40) సజీవ దహనమయ్యాడు. దాదాపు ఏడు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశాయని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మంటల్లో చిక్కుకుని చనిపోయాడని, అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రమాదం వివరాలు తెలియాల్సి ఉందన్నారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.