వేదికపైనే గాయని సజీవ దహనం | Spanish popstar Joana Sainz killed in freak fire accident  | Sakshi
Sakshi News home page

వేదికపైనే గాయని సజీవ దహనం

Sep 2 2019 7:33 PM | Updated on Sep 2 2019 8:19 PM

Spanish popstar Joana Sainz killed in freak fire accident  - Sakshi

ఒక సంగీత కార్యక్రమంలో తీవ్ర  విషాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యూజికల్‌ షోలో  ప్రముఖ స్పానిష్‌   పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌ దుర్మరణం పాలయ్యారు. సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా  బృందంతో కలిసి  ప్రదర్శన ఇస్తుండగా  బాణా సంచా పేలింది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం  బాణాసంచా కాల్చుతున్న సందర్భంగా..  ప్రమాదవశాత్తూ రెండు రాకెట్లు వేదికపై దూసుకు వచ్చాయి.  ఒకటి ఏకంగా ఆమె కడుపులోకి దూసుకుపోయింది. దీంతో వేదిక మీద ఒక్కసారిగా పేలుడు, సంభవించి మంటలంటుకోవడంతో ఆ మంటల్లో జోయానా చిక్కుకు పోయారు.  అపస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేస నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు  జోయానా ఆకస్మిక మరణంపై గ్రూప్‌ ప్రమోటర్లు సంతాపం వెలిబుచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement