పోలీస్ క్వార్టర్స్‌లో చోరీ | theft in police quarters | Sakshi
Sakshi News home page

పోలీస్ క్వార్టర్స్‌లో చోరీ

Published Fri, May 23 2014 11:53 PM | Last Updated on Tue, Aug 21 2018 9:06 PM

theft in police quarters

 తిరువళ్లూరు, న్యూస్‌లైన్ : తిరువళ్లూరులోని పోలీస్ క్వార్టర్స్‌లో గురువారం రాత్రి చోరీ జరిగింది. తిరువళ్లూరులోని సేలై రోడ్డులో పోలీస్ క్వార్టర్స్ ఉంది. ఈ క్వార్టర్స్‌లో రిజర్వ్ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జయశీలన్ నివాసం ఉంటున్నా డు. ఇతను కుటుంబంతో కలిసి గురువారం ఉదయం పళ్లిపట్టులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి పలు వస్తువులు, బంగారు నగలను చోరీ చేసుకెళ్లారు. ఇంటి తలుపులు పగులగొట్టిన విషయాన్ని పక్కింటి వారు జయశీలన్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వేలిముద్రల నిఫుణులను రప్పించి వేలి ముద్రలను సేకరించారు. కాగా   బంగారు నగ లు చోరీ జరిగినా పోలీసులు విషయం బయటకు చెప్పలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement