చింతూరు: ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సుకుమా జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌ను కానిస్టేబుల్ కాల్చిచంపాడు. సుకుమా జిల్లా ధర్మపెంటలోని ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ క్యాంపులో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. హెడ్ కానిస్టేబుల్ అయోధ్యప్రసాద్ దేశ్‌ముఖ్, కానిస్టేబుల్ సమీర్ కృష్ణతీర్థల మధ్య ఓ ఘటనకు సంబంధించి వివాదం మొదలై కొట్లాడుకునే వరకూ వెళ్లింది. సమీర్ ఆగ్రహంతో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చడంతోప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన కానిస్టేబుల్
Published Sun, Mar 8 2015 3:12 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement
Advertisement