రక్షణ కల్పించాల్సిన వారే ఇలా చెస్తే.. | head constable theft the amount in jammu kashmir | Sakshi
Sakshi News home page

రక్షణ కల్పించాల్సిన వారే ఇలా చెస్తే..

Published Thu, Aug 24 2017 3:38 PM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM

రక్షణ కల్పించాల్సిన వారే ఇలా చెస్తే..

రక్షణ కల్పించాల్సిన వారే ఇలా చెస్తే..

జమ్ముకశ్మీర్ : ఏదైనా సమస్య వస్తే, దొంగతనం జరిగితే వెళ్లి పోలీసులను ఆశ్రయిస్తారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే దొంగ అవతారమెత్తాడు. ఓ  నిస్సహాయ వ్యక్తి వద్ద నుంచి సొమ్ములు కొట్టేసిన ఘటన జమ్ముకశ్మీర్‌లో వెలుగు చూసింది. రోడ్లపైన అడుక్కునే బిచ్చగాడి వద్ద నుంచి ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ డబ్బులు కొట్టేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

దీనిపై స్పందించిన పోలీసు అధికారులు నిందితుడిని విధుల నుంచి తొలగించి అరెస్టు చేశారు. జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో మునవ్వర్‌ హుస్సేన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన గతంలో కూడా ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement