జైపూర్ : రాజస్థాన్‌లోమరో మూక హత్య జరిగింది. విధుల్లో ఉన్న ఓ పోలీస్ హెడ్‌కానిస్టేబుల్‌పై కొందరు దాడిచేసి చంపేశారు. రాజ్‌సమంద్ జిల్లాలోని ఓ భూవివాదంలో విచారణ జరుపుతున్న హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఘనీ (48)పై కొందరు శనివారం మూకుమ్మడి దాడిచేశారు. తీవ్రగాయాలతో ఘనీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భూ ఆక్రమణకు పాల్పడిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.
మూకహత్యలతో రాజస్తాన్‌లో కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. పశువులను దొంగిలించాడనే కారణంగా గతేడాది రక్బార్‌ఖాన్ (28) అనే వ్యక్తిపై మూకదాడి జరిగింది. తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు విడిచాడు. ఇక 2017లోనూ పెహ్లుఖాన్ అనే మరో వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టిచంపారు. మాంసం కోసం పశువులను తరలిస్తున్నాడనే అనుమానంతో అతనిపై దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment