మాచారెడ్డి: ఇటీవల పంచాయతీల పునర్విభజనలో కొత్త పంచాయతీగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లె పంచాయతి భవనానికి రూ. కోట్లలో వచ్చిన కరెంటు బిల్లును చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. పంచాయతీ వాటర్ వర్క్స్‌కు సంబంధించిన సర్వీస్ నంబర్ 3801–02321పై ఈనెల 3న ట్రాన్స్‌కో బిల్లింగ్ సిబ్బంది మీటర్ రీడింగ్ నమోదు చేశారు.
జనవరి 2 నుంచి ఫిబ్రవరి 3 వరకు 1,88,15,257 యూనిట్లు వాడినట్టు పేర్కొన్నారు. దీనికి ఏకంగా రూ. 11,41,63,672 బిల్లు విధించారు. ఏసీడీ డ్యూ కింద మరో రూ.8,716 వడ్డించారు. ఈనెల 17 లోపు బిల్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బిల్లును చూసిన సర్పంచ్, పంచాయతీ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. గతనెల విద్యుత్ బిల్లు రూ.3,257 వచ్చిందని సర్పంచ్ తెలిపారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సాంకేతిక సమస్యతో బిల్లు ఇలా వచ్చిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment