చిన్నప్పుడు ‘హోంవర్క్ ఎందుకు
చేయలేదురా?’ అని టీచర్ అడిగితే
‘అంటే..మేడం నేను హోం వర్క్ చేశాను..కానీ ఆ పుస్తకాన్ని మా కుక్క మాంసం ముక్క అనుకుని నమిలేసింది’వంటి టింగరి సమాధానాలు మనమో.. మన ఫ్రెండ్సో చెప్పే ఉంటారు..ఇప్పటికీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూనే ఉంటాం! నేరం చేసి కోర్టు బోనెక్కినప్పుడు కూడా తప్పును పెంపుడు జంతువుపై నెట్టేస్తామా? రష్యాలోని బర్నల్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మాత్రం నెట్టేశాడు. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో విద్యుత్ డిపార్ట్‌మెంట్ అతన్ని కోర్టుకీడ్చింది. ఎందుకు కట్టలేదని జడ్జి అడగ్గా..‘రూ. 90,200 (80వేల రుబెల్స్) బిల్లు! ఇంత మొత్తం మేం కాల్చం. మా పిల్లే ఎనర్జీ మీటర్‌ను ట్యాంపర్ చేసింది’అని సమాధానం ఇచ్చాడు. ఎలా అని ప్రశ్నించారు జడ్జి.. ఆ పిల్లి ఎప్పుడూ తమ ఇంటిపైనే గంతులేస్తుందని, ఎనర్జీమీటర్ పైనుంచే అది పైకి పాకుతుందని, అలా ఎప్పుడో దాని పదునైన గోళ్లతో సీల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని వివరణ ఇచ్చాడు. దీన్ని విద్యుత్‌శాఖ తరఫు న్యాయవాది ఖండించాడు. ఎనర్జీ మీటర్ సీల్‌ను పిల్లి గోళ్లతో తీయలేదని, దాని పళ్లతో కూడా కొరకడం సాధ్యం కాదని వాదించాడు. సీల్‌ను కట్ చేయాలంటే ఎలక్ట్రీషియన్లకే బలమైన కటింగ్ ప్లయర్లు అవసరమయ్యాయని ఆధారాలను కోర్టు ముందుంచాడు. దీంతో జడ్జి అతగాడిని మందలించి, మొత్తం బిల్లు చెల్లించడంతో పాటు రూ.2,800 (2,500 రుబెల్స్) జరిమానా కట్టాలని తీర్పునిచ్చాడు.
పిల్లే అన్నీ చేసింది...
Published Sun, Oct 14 2018 2:46 AM | Last Updated on Sun, Oct 14 2018 10:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment