హైదరాబాద్ : విద్యుత్ బిల్లు కట్టమన్నందుకు అధికారిపై దాడి చేసిన సంఘటన చైతన్యపురి పరిధిలోని ఎస్‌ఆర్కే పురం రోడ్ నెంబర్ 5లో శుక్రవారం చోటుచేసుకుంది. కాలనీలో నివాసముంటున్న ఓ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వినయ్‌కుమార్ గత రెండు నెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించడం లేదు. దీంతో విద్యుత్ అధికారులు బిల్లు కట్టాల్సిందిగా పలుసార్లు చెప్పారు. తాజాగా.. ఈ రోజు ఎలక్ట్రికల్ జూనియర్ లైన్‌మెన్ నాగేశ్వర్ రెడ్డి బిల్లు విషయమై అడగగా ఆగ్రహించిన వినయ్ కుమార్ దాడికి దిగాడు. గాయాలపాలైన లైన్‌మెన్ పోలీసులను ఆశ్రయించారు.