కరెంట్ బిల్లు చెల్లించేందుకు కౌంటర్ వద్దకు వెళ్తే అక్కడ చాంతాడంత క్యూ.. అంత సమయం మనకు లేదు.. బిల్లు చెల్లించి తీరాల్సిందే.. మరెలా..? ఇపుడు క్యూ లైన్‌లో నిలబడి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఆన్‌లైన్‌లోనే.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బుంటే ఎంచక్కా కంప్యూటర్ ముందు కూర్చోని నెట్ ఓపెన్ చేసి బిల్లు చెల్లించండి. అదెలాగో తెలుసుకోండి మరి.. - హస్తినాపురం
ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లు చెల్లించే విధానం..
ముందుగా గూగుల్‌లో ఎంటర్ చేసి సెర్చ్ చేయండి
ఆ వెంటనే తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో పే యువర్ బిల్‌పై నొక్కండి
బిల్ డెస్క్ అని వస్తుంది
ఆ తరువాత ఆన్‌లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనే పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఈఆర్‌ఓ, సర్వీస్ నెంబర్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేయాలి.
ఉదాహరణకు: బిల్‌పై 6146 02194 నంబర్లు ఉంటాయి. అందులో 6146 ఏరియా కోడ్, 194 సర్వీస్ నంబర్ అన్నమాట. వివరాలు నమోదు చేసిన తరువాత మేక్ పేమెంట్‌పై నొక్కండి
గో టూ ఇంటర్నెట్ బ్యాంకింగ్(ఇంటర్నెట్ బ్యాంకు సేవలోకి వెళ్లండి)
సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని వస్తుంది. అప్పుడు మీ బ్యాంకును ఎంపిక చేసుకోండి.
క్లిక్ ఆన్ సబ్‌మిట్‌పై నొక్కండి
ఇట్ విల్ టేక్ యువర్ బ్యాంక్ అకౌంట్ (అది బ్యాంకు ఖాతాను తీసుకుంటుంది)
ఎంటర్ బ్యాంక్ యూజర్ నేమ్ అండ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
క్లిక్ ఆన్ కన్‌ఫార్మ్ వెరిఫైయింగ్ అమౌంట్ అండ్ కరెంట్ మీటర్ నంబర్ అని అడుగుంది.
ఆ తరువాత మీ మొబైల్ నంబర్‌కు ఎనిమిది అంకెలతో కూడిన ఎస్‌ఎంఎస్ వస్తుంది.
దాన్ని అక్కడ ఎంటర్ చేయాలి
క్లిక్ ఆన్ కన్‌ఫార్మ్ అని అడుగుతుంది.(దాన్ని క్లిక్ చేయండి)
రిక్వెస్ట్ కంప్లీటెడ్ మీ బిల్లు చెల్లింపు పూర్తయినట్టు.
తరువాత ప్రింట్ తీసుకోండి
ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లులు చెల్లించండిలా...
Published Thu, Nov 20 2014 12:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement