ఎస్పీడీసీఎల్కు సమ్మె ఎఫెక్ట్
సాక్షి, తిరుపతి: సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యుత్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 72 గంటల సమ్మెలో అటెండర్ నుంచి డీఈల వరకు క్లర్కుల నుంచి జీఎం క్యాడర్ అధికారుల వరకు పాల్గొంటుండటంతో విద్యుత్ సేవల నిర్వహణ నిలిచిపోయిం ది. ఓవైపు బిల్లింగ్, మరోవైపు చెల్లింపులు నిలిచి పోయాయి. డిస్కం ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారు. కంపెనీ పరి ధిలో 12,500 మంది ఉద్యోగులు ఉంటే 97 శాతం మంది సమ్మెలో పాల్గొన్నారు. రెండో రో జుశుక్రవారం ఆరు జిల్లాల్లో ఎస్ఈ కార్యాల యాల నుంచి విద్యుత్ జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీలు, కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు.
నిలిచిన రూ.30 కోట్ల చెల్లింపులు
రోజువారీ విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు కావాల్సిన రూ.15 కోట్లు చొప్పున రెండు రోజులకు రూ.30 కోట్ల రూపాయలు డిస్కంకు రాకుండా నిలిచిపోయాయి. ఈ-సేవలు, విద్యుత్ వినియోగదారుల చెల్లింపు కేం ద్రాల ద్వారా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తుం టారు. ఆరు జిల్లాల్లో 48 గంటలుగా బిల్లింగ్ వసూలు ఆపేశారు. అకౌంట్స్ విభాగానికి చెం దిన అధికారులు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో ఈ ప్రభావం పడింది. సెప్టెంబరులో వినియోగించే విద్యుత్‌కు రూపొందించాల్సిన బిల్లుల తయారీ కూడా పెండింగ్ పడింది. ఈ-సేవల నుంచి ఆన్లైన్ చెల్లింపుల ద్వారా ఎన్నికోట్ల రూపాయల చార్జీలు వసూలయ్యాయనే లెక్కలు సీఎండీకి కూడా తెలియని పరిస్థి తి. ఈ వివరాలు మేనేజ్మెంట్కు అందించాల్సిన అధికారులు కూడా సమ్మెలో ఉన్నారు.
వరుసగా బ్రేక్డౌన్లు.. ప్రకృతి బీభత్సం
సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ప్రభావం ఆరు జిల్లాల్లో హెచ్.టీ సర్వీసులు, విద్యుత్ ఫీడర్లు బ్రేక్‌డౌన్ అయితే గంటల తరబడి పునరుద్ధరించే పరిస్థితి లేదు. జిల్లాకు ఒక ఎస్ఈ మాత్రమే విధుల్లో ఉండటంతో వారు ప్రైవేట్ కాంట్రాక్టర్లను బతిమాలి సర్వీసు బ్రేక్డౌన్లు పునరుద్ధరణ చేస్తున్నారు. సబ్స్టేషన్ల నిర్వహణ గాలిలో దీపంలా మారిం ది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మీదే ఆధారపడి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్పోతే ఎప్పటికొస్తుందో తెలియని పరిస్థితి.
నెల్లూరు జిల్లా గూడూరులో మైన్స్‌లో సర్వీసు బ్రేక్ డౌన్ కావడంతో సమస్య ఏర్పడింది. గుంటూరు జిల్లా నల్లపాడులోనూ ఫీడర్లో సమస్య ఏర్పడటంతో అర్ధరాత్రి వరకు పునరుద్ధరణ పనులు చేస్తూనే ఉన్నారు. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో గాలీవాన బీభత్సానికి విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. చాలా ఫీడర్లు నీటమునిగి పని చేసే పరిస్థితి లేదు. వీటిని పునరుద్ధరించడం, తెగిన విద్యుత్ తీగలను సరిచేయడం ఇప్పట్లో జరిగేలా లేదని ఉన్నతాధికారులు చెబుతున్నా రు. గతంలో 2 గంటల్లో సర్వీసు బ్రేక్డౌన్లు మరమ్మతు చేస్తే ప్రస్తుతం 6 గంటలు పడుతోంది.