దైచీ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త ఎండోమెంట్ ప్లాన్
బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జపాన్‌కు చెందిన దైచీ లైఫ్‌ల జాయింట్ వెంచర్ సుద్ లైఫ్ (స్టార్ యూనియన్ దైచీ లైఫ్ ఇన్సూరెన్స్) తాజాగా ‘సుద్ లైఫ్ ఆదర్శ్’ పేరిట కొత్త ఎండోమెంట్ ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకువ చ్చింది. సుద్ లైఫ్ ఆదర్శ్ అనేది ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ జీవిత బీమా పాలసీ. ఇక్కడ పాలసీదారులు పరిమిత కాల ప్రీమియం చెల్లింపుతో కచ్చితమైన మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ను పొందొచ్చు. అలాగే ఈ పాలసీ కస్టమర్లకు అదనపు యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్స్‌ను ఆఫర్ చేస్తోంది. 8-65 ఏళ్ల వ యసున్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.
మహీంద్రా ఏఎంసీ ‘కర్ బచత్ యోజన’ ఫండ్
మహీంద్రా మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, మహీంద్రా ఫైనాన్స్ పూర్తి అనుబంధ సంస్థ అయిన మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ తాజాగా ‘మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కర్ బచత్ యోజన’ ఫండ్‌ను ఆవిష్కరించింది. మూడు సంవత్సరాలు లాకిన్ పీరియడ్ కలిగిన ఓపెన్ ఎండెడ్ ఈఎల్‌ఎస్‌ఎస్ స్కీమ్ ఇది. ఈ ఫండ్ ఆఫర్ వచ్చే నెల 7తో ముగుస్తుంది. అలాగే 19న తిరిగి ప్రారంభమౌతుంది. ఈ ఫండ్ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ‘కేవలం పన్ను ఆదా కోసం మాత్రమే కాకుండా కుటుంబ ఆర్థిక భద్రతకు ఇది అనువుగా ఉంటుంది’ అని మహీంద్రా ఏఎంసీ సీఈవో, మేనేజింగ్ డెరైక్టర్ అశుతోష్ వివరించారు.
వొడాఫోన్ ఎం-పెసాతో కరెంట్ బిల్లుల చెల్లింపు
వొడాఫోన్‌కు చెందిన డిజిటల్ వాలెట్ సర్వీస్ ‘ఎం-పెసా’ తాజాగా కరెంట్ బిల్లుల చెల్లింపు సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు రాష్ట్రాల ప్రజలు వొడాఫోన్ ఎం-పెసాతో వారి విద్యుత్ బిల్లులను సులభంగా, తక్షణం చెల్లించొచ్చని పేర్కొంది. ఎం-పెసా యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వొడాఫోన్ సొంత స్టోర్లు, ఫ్రాంచైజీలు, మల్టీబ్రాండ్ ఔట్‌లెట్స్, క్యాష్ ఇన్ పాయింట్లలో కూడా బిల్లులను చెల్లించొచ్చు.
పీపీఎఫ్‌ఏఎస్ మ్యూచువల్ ఫండ్ పేరు మారింది
పరాగ్ పారీఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ (పీపీఎఫ్‌ఏఎస్)తాజాగా తన పీపీఎఫ్‌ఏఎస్ లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్ పేరును మార్చింది. ఇకపై ఈ ఫండ్ పేరు పరాగ్ పారీఖ్ లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్‌గా వ్యవహరిస్తారు. ‘మా వ్యవస్థాపకులు దివంగత పరాగ్ పారీఖ్‌కి నివాళిగా మేం పథకం పేరును మారుస్తున్నాం. ఆయన దార్శనికత, చేపట్టిన చర్యల వల్లే మేం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. కొత్త పేరును కస్టమర్లు సులభంగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాం’ అని పీపీఎఫ్‌ఏఎస్ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ , సీఈవో నీల్ పారీఖ్ తెలిపారు. పరాగ్ పారీఖ్ లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్ అనేది ఒక ఈక్విటీ ఫండ్.
హైదరాబాద్‌లో విస్తరణ దిశగా హోమ్ క్రెడిట్
హైదరాబాద్: దేశీ ప్రముఖ కన్జ్యూమర్ ఫైనాన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ‘హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్’ తాజాగా హైదరాబాద్‌లో కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడి పాయింట్ ఆఫ్ సేల్స్ సంఖ్యను ఈ ఏడాది చివరకు నాలుగింతలు పెంచుకోవాలని భావిస్తోం ది. దీనికి అనువుగా కొత్తగా 700 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. కాగా దేశవ్యాప్తంగా సంస్థకు 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణలో వృద్ధికి హైదరాబాద్‌లో కార్యకలాపాల విస్తరణ వ్యూహం తమకు ప్రధానమైనదని సంస్థ సీఎంవో థామస్ హర్డ్‌లికా పేర్కొన్నారు. సాధ్యమైనంతమంది కస్టమర్లకు చేరువకావడమే తమ లక్ష్యమని తెలిపారు.
బ్రీఫ్స్
Published Mon, Sep 19 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
Advertisement
Advertisement