Endowment Plan
-
ఎల్ఐసీ.. జీవన్ ఉమంగ్ పాలసీ
8 శాతం వార్షిక రాబడి ∙వందేళ్ల దాకా కవరేజి ముంబై: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మంగళవారం కొత్తగా దీర్ఘకాలిక ఎండోమెంట్ ప్లాన్ ’జీవన్ ఉమంగ్’ ప్రవేశపెట్టింది. ఇటు ఇన్‌కం అటు బీమా రక్షణ పాలసీల మేళవింపుతో ఉండే ఈ ప్లాన్.. వందేళ్ల దాకా కవరేజి అందిస్తుంది. వార్షికంగా 8 శాతం మేర ఖచ్చితమైన రాబడి హామీతో ఈ పాలసీ లభిస్తుంది. పాలసీదారుకు ప్రీమియం చెల్లింపు వ్యవధి పూర్తయిన నాటి నుంచి తొంభై తొమ్మిదేళ్లS వయస్సు వచ్చే దాకా వార్షికంగా సర్వైవల్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇక పాలసీ మెచ్యూరిటీ సమయంలో లేదా పాలసీదారు మరణించిన పక్షంలో ఏకమొత్తంగా సమ్ అష్యూర్డ్‌ను కంపెనీ చెల్లిస్తుంది. బేసిక్ సమ్ అష్యూర్డ్, పెయిడప్ సమ్ అష్యూర్డ్‌లో వార్షికంగా 8 శాతం మేర సర్వైవల్ బెనిఫిట్ చెల్లించడం జరుగుతుంది. 90 రోజుల పిళ్లల నుంచి 55 ఏళ్ల దాకా వయస్సు గలవారు ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. బేసిక్ సమ్ అష్యూర్డ్‌కి ఎటువంటి పరిమితులు లేవు. ప్రీమియం చెల్లింపు వ్యవధులు 15, 20, 25, 30 ఏళ్లుగా ఉన్నాయి. మరోవైపు, పాలసీల సంఖ్యాపరంగా తమ మార్కెట్ వాటా 76.09 శాతంగా ఉందని ఎల్ఐసీ వెల్లడించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రీమియం వ్యాపార విభాగం 27.22 శాతం వృద్ధి చెందింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం ఫస్ట్ ఇయర్ ప్రీమియం రూ. 98,000 కోట్ల నుంచి రూ. 1.24 లక్షల కోట్లకు పెరిగింది. -
బ్రీఫ్స్
దైచీ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త ఎండోమెంట్ ప్లాన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జపాన్‌కు చెందిన దైచీ లైఫ్‌ల జాయింట్ వెంచర్ సుద్ లైఫ్ (స్టార్ యూనియన్ దైచీ లైఫ్ ఇన్సూరెన్స్) తాజాగా ‘సుద్ లైఫ్ ఆదర్శ్’ పేరిట కొత్త ఎండోమెంట్ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకువ చ్చింది. సుద్ లైఫ్ ఆదర్శ్ అనేది ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ జీవిత బీమా పాలసీ. ఇక్కడ పాలసీదారులు పరిమిత కాల ప్రీమియం చెల్లింపుతో కచ్చితమైన మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ను పొందొచ్చు. అలాగే ఈ పాలసీ కస్టమర్లకు అదనపు యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్స్‌ను ఆఫర్ చేస్తోంది. 8-65 ఏళ్ల వ యసున్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. మహీంద్రా ఏఎంసీ ‘కర్ బచత్ యోజన’ ఫండ్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, మహీంద్రా ఫైనాన్స్ పూర్తి అనుబంధ సంస్థ అయిన మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా ‘మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కర్ బచత్ యోజన’ ఫండ్‌ను ఆవిష్కరించింది. మూడు సంవత్సరాలు లాకిన్ పీరియడ్ కలిగిన ఓపెన్ ఎండెడ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ఇది. ఈ ఫండ్ ఆఫర్ వచ్చే నెల 7తో ముగుస్తుంది. అలాగే 19న తిరిగి ప్రారంభమౌతుంది. ఈ ఫండ్ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ‘కేవలం పన్ను ఆదా కోసం మాత్రమే కాకుండా కుటుంబ ఆర్థిక భద్రతకు ఇది అనువుగా ఉంటుంది’ అని మహీంద్రా ఏఎంసీ సీఈవో, మేనేజింగ్ డెరైక్టర్ అశుతోష్ వివరించారు. వొడాఫోన్ ఎం-పెసాతో కరెంట్ బిల్లుల చెల్లింపు వొడాఫోన్‌కు చెందిన డిజిటల్ వాలెట్ సర్వీస్ ‘ఎం-పెసా’ తాజాగా కరెంట్ బిల్లుల చెల్లింపు సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు రాష్ట్రాల ప్రజలు వొడాఫోన్ ఎం-పెసాతో వారి విద్యుత్ బిల్లులను సులభంగా, తక్షణం చెల్లించొచ్చని పేర్కొంది. ఎం-పెసా యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వొడాఫోన్ సొంత స్టోర్లు, ఫ్రాంచైజీలు, మల్టీబ్రాండ్ ఔట్లెట్స్, క్యాష్ ఇన్ పాయింట్లలో కూడా బిల్లులను చెల్లించొచ్చు. పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్ పేరు మారింది పరాగ్ పారీఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ (పీపీఎఫ్ఏఎస్)తాజాగా తన పీపీఎఫ్ఏఎస్ లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్ పేరును మార్చింది. ఇకపై ఈ ఫండ్ పేరు పరాగ్ పారీఖ్ లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్‌గా వ్యవహరిస్తారు. ‘మా వ్యవస్థాపకులు దివంగత పరాగ్ పారీఖ్కి నివాళిగా మేం పథకం పేరును మారుస్తున్నాం. ఆయన దార్శనికత, చేపట్టిన చర్యల వల్లే మేం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. కొత్త పేరును కస్టమర్లు సులభంగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాం’ అని పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ , సీఈవో నీల్ పారీఖ్ తెలిపారు. పరాగ్ పారీఖ్ లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్ అనేది ఒక ఈక్విటీ ఫండ్. హైదరాబాద్‌లో విస్తరణ దిశగా హోమ్ క్రెడిట్ హైదరాబాద్: దేశీ ప్రముఖ కన్జ్యూమర్ ఫైనాన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ‘హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్’ తాజాగా హైదరాబాద్‌లో కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడి పాయింట్ ఆఫ్ సేల్స్ సంఖ్యను ఈ ఏడాది చివరకు నాలుగింతలు పెంచుకోవాలని భావిస్తోం ది. దీనికి అనువుగా కొత్తగా 700 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. కాగా దేశవ్యాప్తంగా సంస్థకు 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణలో వృద్ధికి హైదరాబాద్‌లో కార్యకలాపాల విస్తరణ వ్యూహం తమకు ప్రధానమైనదని సంస్థ సీఎంవో థామస్ హర్డ్లికా పేర్కొన్నారు. సాధ్యమైనంతమంది కస్టమర్లకు చేరువకావడమే తమ లక్ష్యమని తెలిపారు. -
డివిడెండ్-గ్రోత్... ఏ ఆప్షన్ బెటర్?
నేను అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడిని. నేను భారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే ఇక్కడి కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరించడం లేదు. దీనికి కాణమేమిటి? - మహేందర్, కాలిఫోర్నియా(ఈ మెయిల్ ద్వారా) అమెరికా, కెనడాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయుల నుంచి దరఖాస్తులను పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంగీకరించడం లేదు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైనన్స్ యాక్ట్(ఫ్యాట్కా) కారణంగానే పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎన్నారైల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరించడం లేదు. ఈ చట్టం ప్రకారం అమెరికా జాతీయుల, అమెరికాలో స్థిరపడిన విదేశీయుల అన్ని లావాదేవీలను ప్రపంచంలోని ఆర్థిక సంస్థలు అమెరికా ప్రభుత్వానికి నివేదించాలి. అయితే ఎల్ అండ్ టీ, యూటీఐ, పీపీఎఫ్ఏఎస్, సుందరం, కెనరా రొబెకొ.. ఈ సంస్థలు ఎన్నారైల నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరిస్తున్నాయి. త్వరలో మరిన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఎన్నారైల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరించే అవకాశాలున్నాయి. నేను 2015, జూలైలో ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్‌ను తీసుకున్నాను. ఒక ప్రీమియమ్‌ను చెల్లించాను. ఈ ఏడాది వార్షిక ప్రీమియమ్గా రూ.14,711 చెల్లించాల్సి ఉంది. ఈ ప్లాన్‌కు బీమా కవరేజ్ రూ.3,75,000గానూ, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రూ.3,75,000 గానూ ఉంది. అయితే నేను ఇప్పటికే టాటా ఏఐఏ సంస్థ నుంచి రూ.50 లక్షలకు టర్మ్ ప్లాన్ తీసుకున్నాను. దీనిని దృష్టిలో ఉంచుకుంటే ఈ ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ పాలసీని కొనసాగించడం సమంజసమేనా? లేకుంటే ఈ ప్లాన్ నుంచి వైదొలగమంటారా? - లోకేశ్, విశాఖపట్టణం ఎండోమెంట్ ప్లాన్ల విషయంలో పలు సంస్థలు వ్యయాలు విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్....దీనికి మినహాయింపు కాదు. మీకు నష్టాలు వచ్చినప్పటికీ, తగిన రాబడులనివ్వలేని ప్లాన్‌ల్లో కొనసాగడం సరికాదు. ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయడం సముచితమని భావిస్తున్నాం. తొలి ఏడాది కట్టిన ప్రీమియమ్‌ను మర్చిపోండి. ఈ ప్లాన్ తీసుకొని మూడేళ్లు పూర్తికాలేదు కాబట్టి మీకు సరెండర్ ఆప్షన్ కూడా లభించదు. ఇలాంటి బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్లు తగిన రాబడులను ఇవ్వలేవు. అలాగే సరిఅయిన బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు. అందుకని భవిష్యత్తులో ఇలాంటి బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయకండి. బీమా కవరేజ్‌కి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి. వీటికి ప్రీమియమ్‌లు తక్కువగా ఉంటాయి. బీమా కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతమున్న మీ టర్మ్ ప్లాన్.. మీకు తగిన బీమా కవరేజ్ ఇస్తుందో లేదో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. నా వయస్సు 59 సంవత్సరాలు. వచ్చే ఏడాది జనవరిలో రిటైరవుతున్నాను. రిటైర్మెంట్ ప్రయోజనాలు రూ.60 లక్షలు వస్తాయి. కుటుంబ పెన్షన్ కింద నెలకు రూ.12,000 వస్తాయి. నేను పెట్టిన పెట్టుబడులు ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం, షేర్లలో రూ.18 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.13 లక్షలుగా ఉన్నాయి. రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా రూ.5 లక్షల బ్యాంక్ ఆఫ్ బరోడా వారి హెల్త్ ప్లాన్ ఉంది. నేను తీర్చాల్సిన అప్పులేమీ లేవు. నేను సొంత ఇంట్లోనే ఉంటున్నాను. పెన్షన్ ఆదాయం కాకుండా నెలకు రూ.60,000 వరకూ ఆదాయం వచ్చేట్లుగా ఈ డబ్బులను ఎలా ఇన్వెస్ట్ చేయాలో సూచించండి? - నారాయణరావు, హైదరాబాద్ ముందుగా మీరు ఏం చేస్తారంటే, స్వీప్ ఇన్ సౌకర్యం ఉన్న సేవింగ్స్ ఖాతాలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయండి. మీ నెలవారీ ఖర్చులను లెక్కించి, ఏడాదికి సరిపడేలా మొత్తాన్ని ఈ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేయండి. ఇక క్రమం తప్పని ఆదాయం కోసం సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయండి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు క్రమం తప్పని ఆదాయం లభిస్తుంది. అంతే కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా కూడా ఉంటాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద మీరు గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో మీకు 8.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకు మీకు రూ.64,500 (నెలకు రూ.21,500) వస్తాయి. ఇక పోస్ట్ ఆఫీస్ మంథ్లీఇన్కమ్ స్కీమ్‌లో రూ.9 లక్షలు (జాయింట్ అకౌంట్)లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 7.8 శాతం వార్షిక వడ్డీ వస్తుంది. నెలకు రూ.5,850 ఆదాయం లభిస్తుంది. ఈ రెండు సాధనాల్లో వచ్చే ఆదాయంపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండింటిపై వచ్చే ఆదాయాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను లెక్కిస్తారు. ఇక వీటికి అనుబంధంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. అంతేకాకుండా ఏడాది తర్వాత వీటిని విక్రయిస్తే ఎలాంటి పన్ను పోటు ఉండదు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు వస్తాయి. అంతేకాకుండా మీ నెలవారీ ఆదాయ అవసరాలు కూడా తీర్చుకోవచ్చు. నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలో, గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలో తెలియక తికమకపడుతున్నాను. తగిన సూచనలివ్వండి. - లక్ష్మణ్, వరంగల్ రెగ్యులర్‌గా డబ్బులు అవసరమైన పక్షంలో మాత్రమే డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిటైరైన తర్వాత మీకు రెగ్యులర్‌గా డబ్బులు అవసరమవుతాయి. కాబట్టి అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే మీరు గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకుంటేనే మంచిది. చక్రగతి వృద్ధి కారణంగా మంచి రాబడులు మీరు పొందవచ్చు. డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, మీకు వచ్చే డివిడెండ్లను మీరు ఖర్చు పెట్టేయడమో, లేదా తక్కువ రాబడులు వచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడమో జరుగుతుంది. మీరు గ్రోత్ ఆప్షన్ ఎంచుకున్నా, డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్నా, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏడాది దాటితే మీరు ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రక్షణా...రాబడా?
పసిపాప దగ్గర్నుంచి పదవీ విరమణ చేసే వ్యక్తుల వరకు అనేక రకాల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బీమా కంపెనీలు కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందుబాటులో ఉన్న వివిధ బీమా పథకాలు, అవి అందించే ప్రయోజనాలు, ఎవరికి అనువుగా ఉంటాయన్న విషయాలపై అవగాహన పెంచేదే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం. బీమా పాలసీలపై నిపుణుల అభిప్రాయాలు రెండు రకాలుగా ఉంటాయి. ఆపద సమయంలో ఆర్థికంగా తోడ్పాటునిచ్చే సాధనంగానే బీమాను చూడాలన్నది కొందరి వాదన. బీమా అంటే బహుళ ప్రయోజనకరమైన ఇన్వెస్ట్మెంట్ సాధనమని, ఆర్థిక రక్షణతో పాటు పన్ను ప్రయోజనాలు, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చని మరి కొందరు అంటారు. ఒక విధంగా చూస్తే ఈ రెండు వాదనలూ సబబే. అందుకే బీమా కంపెనీలు కూడా ఇరు వర్గాల అభిప్రాయాలకు అనుగుణంగా పథకాలను విడుదల చేస్తున్నాయి. అందించే ప్రయోజనాలను బట్టి బీమా పథకాలను ఏడు రకాలుగా విభజించొచ్చు. ఇప్పుడు వీటి గురించి విడివిడిగా తెలుసుకుందాం. ఎండోమెంట్ ప్లాన్ బీమా రక్షణతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఎండోమెంట్ పథకాలు అనువుగా ఉంటాయి. పిల్లల చదువు, పెళ్లి, సొంతింటి నిర్మాణం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను ఎండోమెంట్ పథకాల ద్వారా చేరుకోవచ్చు. ఈ పథకాలు నిర్దిష్ట కాలానికి బీమా రక్షణ కల్పిస్తూ, కాలపరిమితి ముగిసిన తర్వాత మెచ్యూర్టీ కింద మొత్తం సొమ్మును ఒకేసారి అందిస్తాయి. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వీటి రాబడి తక్కువగానే ఉంటుంది. ఎండోమెంట్ పాలసీల వార్షిక సగటు రాబడి 5-6 శాతంగా ఉంది. వీటిపై ఉండే పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే రాబడి 10 శాతం దాటుతుందని ఆర్థిక నిపుణుల అంచనా. కట్టిన ప్రీమియంపై పన్ను ప్రయోజనాలతో పాటు, మోచ్యూర్టీ కింద వచ్చే లాభంపై కూడా ఎటువంటి పన్ను ఉండదని, అదే బ్యాంకు డిపాజిట్లలో అయితే వడ్డీపై ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. సాధారణంగా ఎండోమెంట్ పాలసీలు 10, 15, 20, 30 ఏళ్ళ కాలపరిమితుల్లో లభిస్తుంటాయి. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయంతో పాటు బీమా రక్షణ కావాలనుకునే వారికి ఎండోమెంట్ పాలసీలు అనువుగా ఉంటాయి. మనీ బ్యాక్ ప్లాన్ ఇవి ఎండోమెంట్ పాలసీ లక్షణాలనే కలిగి ఉన్నప్పటికీ వీటి పేరులో ఉన్నట్లుగానే మధ్యమధ్యలో నగదును వెనక్కి ఇస్తుంటాయి. ప్రతీ మూడేళ్లకు ఒకసారి లేదా ఐదేళ్లకు ఒకసారి చొప్పున ఇలా నగదును వెనక్కి ఇస్తుంటాయి. పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి మధ్యమధ్యలో నగదు కావాలనుకునే వారికి మనీ బ్యాక్ పథకాలు అనువుగా ఉంటాయి. మధ్యమధ్యలో కొంత మొత్తం చొప్పున ముందే నగదు తీసుకుంటారు కాబట్టి ఈ మేరకు మెచ్యూర్టీ సమయంలో అందుకునే మొత్తం తగ్గుతుంది. అంతే కాకుండా సాధారణ ఎండోమెంట్ పాలసీల కంటే మనీ బ్యాక్ పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనీ బ్యాక్ పాలసీలకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణుల సూచన. హోల్‌లైఫ్ పాలసీలు ఇప్పుడు అనేక బీమా కంపెనీలు హోల్‌లైఫ్ పేరిట జీవిత కాలం లేదా 100 ఏళ్ళ వరకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవితకాలం బీమా రక్షణ లభిస్తుంది. వీటిని చిన్న వయస్సులోనే తీసుకుంటే తక్కువ ప్రీమియంతోనే జీవిత కాలం బీమా రక్షణ పొందవచ్చు. యులిప్స్... రిస్క్ చేయగల సామర్థ్యం ఉండి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడికై స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యులిప్) రూపొందించారు. వీటి పనితీరు ఇంచుమించు మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. యులిప్స్‌లో బీమా రక్షణతో పాటు పన్ను ప్రయోజనాలు అదనం. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తారు. అందువల్ల వీటి రాబడులపై కచ్చితమైన హామీ ఉండదు. ఇవి దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనాలు. ఐదేళ్ల లాకిన్ పిరియడ్ అయిపోయిన వెంటనే వైదొలగకుండా కనీసం 10 ఏళ్లైనా వేచి చూస్తేనే యులిప్స్ ప్రయోజనాలను పొందగలం అంటున్నారు బీమా నిపుణులు. యులిప్స్‌లో ఉండే అధిక చార్జీలను ఐఆర్డీఏ తగ్గించడంతో ఇప్పుడివి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నారు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలను అందించడంలో ఈక్విటీలు ముందుంటాయి కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాలకు యులిప్‌లు అనువుగా ఉంటాయి. పెన్షన్ ప్లాన్స్ పదవీ విరమణ తర్వాత పెన్షన్ కావాలనుకునే వారు ఈ రిటైర్మెంట్ పథకాలను ఆశ్రయించాలి. రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఎండోమెంట్, యులిప్స్‌లో ఒక పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు సాధారణంగా అన్ని బీమా పథకాలు 55 నుంచి 60 ఏళ్ళ వరకు రిటైర్మెంట్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నాయి. ఈ విధంగా సమకూరిన మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతీ నెలా లేదా మూడు నెలలకు ఒకసారి చొప్పున పెన్షన్ పొందచ్చు. సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచే రిటైర్మెంట్కు కేటాయించడం మొదలు పెడితే తక్కువ మొత్తంతోనే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. హెల్త్ పాలసీలు ఇప్పుడు వైద్య ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేం కాబట్టి అందరూ వైద్య బీమా తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌కు కూడా టర్మ్ పాలసీల మాదిరిగా క్లెయిమ్‌లు తప్ప మెచ్యూర్టీ ఉండదు. వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి.