లాక్‌డౌన్‌తో నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ప్రభుత్వాలు కరెంటు బిల్లుతో దోపిడీకి దిగుతున్నాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందేరు. అయితే ఈ కష్టాలు సామాన్యులకేనా? సెలబ్రిటీలకు తప్పడం లేదని హీరోయిన్ కార్తీక నాయర్ రుజువు చేసింది. ఆమె ఇంటికి కరెంటు బిల్లు అక్షరాలా లక్ష రూపాయలు వచ్చింది. ఇది చూసి గుడ్లు తేలేసిన కార్తీక ట్విటర్‌లో తన కోపాన్నంతటినీ కక్కేసింది. 'ముంబైలో ఏం కుంభకోణం జరుగుతోంది?' అంటూ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌ను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. (సింగిల్ ఫ్యాన్.. 128 కోట్ల కరెంట్ బిల్లు)
'లాక్‌డౌన్‌లో కరెంటు మీటర్ రీడింగ్ తీయలేదు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత 3 నెలల రీడింగ్ ఒకేసారి తీశారు. దీంతో ఒక్క జూన్ నెలలోనే తనకు లక్ష బిల్లు వచ్చింద'ని వాపోయింది. చాలామంది ముంబైవాసులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని ఆమె ప్రస్తావించింది. ఇక ఇప్పటికే నటి ప్రసన్న కూడా వాచిపోతున్న కరెంటు బిల్లుపై ప్రభుత్వాన్ని ఎండగట్టిన విషయం తెలిసిందే. మరి అధికారులు ఈమె ట్వీట్‌కు స్పందిస్తారో లేదో చూడాలి. కాగా కార్తీక చివరిసారిగా "అరంభ్: కహానీ దేవసేన కీ" అనే టీవీ సిరీస్‌లో నటించింది. అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తగిన గుర్తింపు సంపాదించుకుంది. (తెలుగు హీరో- డైరెక్టర్ లిప్‌లాక్ ఫోటో వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment