
నేడు విచారించనున్న సీజేఐ ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కేసీఆర్ తరపున న్యాయవాది మోహిత్ రావ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో తెలంగాణ ప్రభుత్వం, జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు. సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment