ఆత్మహత్యకు ముందు రోహిత్ ఆవేదన..
(సూసైడ్ నోట్‌లోని ముఖ్యాంశాలు)
♦ నాకు అనేక సమస్యలున్నాయి. అవే ఆత్మహత్యకు ప్రేరేపించాయి. బతికుండటం కంటే మరణంలోనే నాకు ఆనందముంది. నా దేహానికి, ఆత్మకు దూరం పెరుగుతున్నట్లనిపిస్తోంది.
♦ కార్ల్ సాగన్ మాదిరిగా గొప్ప సైన్స్ రచయిత కావాలనుకున్నా. చివరికిలా ఆత్మహత్య లేఖ రాయాల్సి వచ్చింది. ఇలాంటి లేఖ రాయడం నాకిదే తొలిసారి. బహుశా నా చర్య తప్పే కావచ్చు.
♦ ప్రస్తుతం నాలో బాధా లేదు, ప్రేమా లేదు. పూర్తి శూన్యంగా ఉన్నాను. ఇది చాలా దారుణమైన స్థితి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను.
♦ మనిషిని కులంతోనే అంచనా వేస్తున్నారు తప్ప తనకు మనసుంటుందని గుర్తించడంలేదు. మనిషిని ఒక ఓటుగా, అంకెగా, వస్తువుగానే చూస్తున్నారు.
♦ ఆత్మలపై, పునర్జన్మలపై నాకైతే నమ్మకంలేదు. మరణానంతరం చుక్కలదాకా పయనిస్తానని, ఇతర ప్రపంచాల గురించి తెలుసుకుంటానని నా నమ్మకం.
♦ నేను సైన్స్‌ను, ప్రకృతిని, నా చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించాను. కానీ ప్రజలు ప్రకృతికి దూరమవుతున్నారు.