సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: క్యాన్సర్ నివారణకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్), ఐకేపీ నాలెడ్జ్ పార్క్ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలు ముగిశాయి. రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పరిశోధనల్లో క్యాన్సర్ నివారణ కోసం ‘టెమోజొలోమైడ్’ అనే ఔషధాన్ని కనుగొన్నారు. పరిశోధనల్లో భాగంగా పలు జంతువులపై ఈ ఔషధాన్ని ప్రయోగించారు. ‘టెమోజొలోమైడ్’ ఔషధాన్ని క్యాన్సర్‌తో పాటు బ్రెయిన్ ట్యూమర్‌కు సైతం ఉపయోగించవచ్చని పరిశోధకులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఔషధాన్ని కనుగొన్నవారిలో హెచ్‌సీయూ రసాయనశాస్త్ర ప్రొఫెసర్ అశ్వనీనాంగియా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్త దినేష్‌కుమార్ ఉన్నారు. యూనివర్సిటీలోని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబెటర్‌లో పరిశోధనలు జరిగారుు.
క్యాన్సర్ నివారణపై ముగిసిన పరిశోధనలు
Published Wed, Feb 19 2014 5:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement